‘అమ్మఒడి’ ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో 5 సంవత్సరాల వయసు నిండి బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్ఎస్ గంగాభవాని, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్ల వయసు కలిగిన పిల్ల లు 50 వేల 200 మంది ఉండగా, అంగన్వాడీ కేంద్రాల్లో 27 వేలమంది వరకూ ఉన్నారని తెలిపారు. ఈ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, యూనీఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు, మరుగుదొడ్లు సౌకర్యం వంటివాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 22 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిఈడు పిల ్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామ