ఇండియా ‘బ్లూ’కు రోహిత్..‘రెడ్’కు పార్థివ్
దేవదార్ ట్రోఫీ లో భారత బ్యాట్‌మెన్స్‌లు రోహిత్ శర్మ ఇండియా ‘బ్లూ’ టీంకు, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇండియా రెడ్ టీంకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఇండియా బ్లూలో, శిఖర్ ధావన్‌కు ఇండియా రెడ్‌లో చోటు దక్కింది. ఈ రెండు జట్లతో పాటు విజయ్‌హజారే ట్రోఫీ విజేత తమిళనాడు కూడా ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు విశాఖపట్నంలో డీబీ దేవదార్ ట్రోఫీ జరుగనుంది.
ఇండియా బ్లూ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, హర్భజన్ సింగ్, క్రునాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్, సిద్ధార్త్ కౌల్, శార్థూల్ ఠాకూర్, కృష్ణ, పంకజ్ రావ్.
ఇండియా రెడ్ జట్టు: పార్థివ్ పటేల్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, ఇషాంక్ జగ్గీ, గుర్కీరత్ మన్; అక్సర్ పటేల్, అక్షయ్ కామేశ్వర్, అశోక్ దిండా, కుల్వంత్ ఖేజ్రోలియా, ధావల్ కులకర్ణి, గోవింద పొద్దర్