Deogarh temple
-
మరోసారి శివుడిగా దర్శనమిచ్చిన మాజీ మంత్రి
పట్నా : రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నాయకుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువ నేత తన వివాహ సందర్భంగా ఆదిదంపతులు శివపార్వతుల రూపంలో తన ఫోటోలను ప్రింట్ చేయించుకుని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తేజ్ మరోసారి శివుడి అవతారాన్ని ధరించారు. శివాలయంలో పూజలు నిర్వహించడానికి తేజ్ ప్రతాప్, ఏకంగా శంకరుని వేషధారణలో ఆలయానికి బయలు దేరారు. ఒంటి మీద పులిచర్మం, చేతిలో త్రిశూలం ధరించి డియోఘడ్‌లో ఉన్న బైద్యనాథ్ ధామ్ ఆలయానికి వెళ్లారు. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఢమరుకం మోగిస్తూ, హారతి సమయంలో శంఖాన్ని ఊదుతూ పూజ కొనసాగించారు. ఈమధ్య తేజ్ ప్రతాప్.. ఓ సైకిల్ యాత్ర చేశారు. అయితే సైకిల్ యాత్ర సందర్భంగా ఆయన పట్టు తప్పి కింద పడిపోయారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. దాంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు. -
నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్
ఔరంగాబాద్: అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన బీహార్‌లోని ఔరంగబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్కత్తా 2వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. శివభక్తులంతా జార్ఖాండ్‌లోని దేవ్‌గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని వస్తున్నారని... ఆ క్రమంలో శివభక్తులంతా ప్రయాణ బడలికతో వారు ప్రయాణిస్తున్న బస్సును జాతీయ రహదారి పక్కన ఉంచి ... ఆ పక్కనే వారు నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ వెల్లడించారు. అదే రహదారిపై అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పడంతో శివభక్తులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.