విభజన వివరాలు ఆన్లైన్లో నమోదు
హన్మకొండ అర్బన్ : నూతనంగా జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు తమ శాఖ వివరాలు మెుత్తం కొత్తగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని జిల్లా జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో విభజన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమైన 63 ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చారని, వాటి ద్వారా లాగినై పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. నమోదుకు సంబందించి బుధవారం సిబ్బందితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజేసీ, డీఆర్వో ఇతర అధికారులు పాల్గొన్నారు.