తిరుమలలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
సాక్షి, తిరుమల: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముండ్ర శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మహేష్‌కుమార్ జైన్ ఉన్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ముండ్ర కుటుంబసభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మంపడంలో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆలయ అధికారులు వారికి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.