కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు తీసుకుంటున్నట్లు హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోల ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన ఏడు మండలాల్లో కేంద్ర నిధులతో రోడ్లు, పోలీసుస్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. డిపాజిట్లు, మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రాష్ట్రంలో అనేక సంస్థలు అక్రమ లావాదేవీలు జరుపుతున్నాయన్నారు. సినీ నటులు, ప్రముఖులు అలాంటి సంస్థల ప్రకటనల్లో నటించవద్దని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పోలీసు విభాగంలో 14 వేల ఖాళీలు
పోలీసు విభాగంలో 200 ఎస్సై పోస్టులతో కలిపి మొత్తం 14 వేల ఖాళీలున్నాయని చినరాజప్ప చెప్పారు. భర్తీకి అనుమతివ్వాలని ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు.