‘ఏపీలో జైళ్లను ఆధునీకరిస్తాం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని జైళ్లన్నింటినీ ఆధునీకరిస్తామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు. విజయవాడలో రూ.1.50 లక్షలతో ఆధునీకరించిన జిల్లా జైలును ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్న జైళ్లను శివారు ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. అలాగే ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకువచ్చే బాధ్యత జైలు సిబ్బందిదేనని చెప్పారు.