'హనుమాన్ జయంతి రోజు పరీక్షలా?'
హైదరాబాద్: హనుమాన్ జయంతి రోజైన ఏప్రిల్ 4న పరీక్షలు నిర్వహించటంపై హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ పరీక్షను వచ్చేనెల 4వ తేదీన కొనసాగించటంపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఆరోజును సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు రమణాచారిని కలసి వినతి పత్రం సమర్పించనున్నట్లు భజరంగ్‌దళ్ నేత సుభాష్ తెలిపారు.