Desert Region
-
వీడియో: నీళ్లు తాగాలంటే ఇంత చేయాలా.. ఎక్కడో కాదు మన దేశంలోనే..
ఎంతో మంది తమకు తెలియకుండానే నీటిని చాలా వరకు వృథా చేస్తుంటారు. ఫ్రీగా వచ్చాయి కదా అని.. కులాయి ఆన్‌చేసి కొద్దిపాటి అవసరానికి కూడా పెద్ద మొత్తంలో నీటిని పారబోస్తుంటారు. అలాంటి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే.. దేశంలో మంచినీరు దొరకని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ కూడా ఒకటి. కాగా, రాజస్థాన్‌లోని ఎడారి సమీపంలో నివసించే ప్రజలు మంచినీటి కోసం ప్రతీరోజు ఎంత కష్టాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ బావి వద్ద ఓ వ్యక్తి కొన్ని సంచులతో చేసిన ఓ కుండలాంటి వస్తువును తయారుచేశాడు. అనంతరం.. దాన్ని బావిలోకి వదులుతాడు.. తర్వాత ఆ తాడును రెండు ఒంటెలు లాగేలా ఉన్న పరికరానికి తగిలిస్తాడు. దీంతో, ఆ రెండు ఒంటెలు తాడును తాగుతూ ముందుకు వెళ్లగానే సంచిలో నీరుపైకి వస్తుంది. అనంతరం, ఆ నీటిని పక్కనే ఉన్న ఓ సంపులో భద్రపరుచుకుంటున్నారు. ఇక, ఈ వీడియోకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ.. నీరు చాలా విలువైనది, చాలా జాగ్రత్తగా వాడండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Water is very precious resource......use it carefully 💦 pic.twitter.com/g6UNIFwEnk — Dr.Samrat Gowda IFS (@IfsSamrat) December 1, 2022 ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీడియో జైసల్మేర్‌కి చెందినదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాజస్థాన్ బోర్డర్లో ఉన్న వారికి వేసవిలో బీఎస్ఎఫ్ జవాన్లు వాటర్ అందిస్తారని చెప్పుకొచ్చారు. మరో నెటిజన్.. అనుభవం మాత్రమే పాఠాన్ని నేర్పుతుంది. నీటి విషయంలో మనం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అది మనిషి స్వభావం అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. Only the practical experience will teach the lesson. Anything for instance as long as you get in surplus we ont realise. By the time we realise everything is over. That's human nature Sir. — T. Chandrasekar (@TChandr64295322) December 1, 2022 -
ఆ పట్టణంలో వర్షం కురిసిన దాఖలాలే లేవు..!
భూమిపై వర్షం కురువని ప్రదేశం ఒకటి ఉందన్న విషయం నమ్మశక్యంగా లేదా..? నమ్మశక్యంగా లేనప్పటికీ తప్పక నమ్మి తీరాల్సిందే. చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు. ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది. -
వేసవికి ముందే ‘చంపా’ ఎడారి..!
సాక్షి, నెల్లిమర్ల: జిల్లాలోనే అతిపెద్ద నది చంపావతి వేసవికి ముందే పూర్తిగా ఎండిపోయింది. ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే నీరులేక వెలవెలబోతోంది. పలుచోట్ల చుక్కనీరు కూడా లేకుండా ఎడారిని తలపిస్తోంది. దీంతో రానున్న నిండు వేసవిలో నదిలోని భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా కానుంది. జిల్లాలోనే అతిపెద్దదైన చంపావతి నది ఏడు మండలాల్లో ప్రవహిస్తోంది. మెంటాడ మండలం ఆండ్ర కొండల్లో పుట్టిన నది ఆ మండలంతో పాటు గజపతినగరం, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ మండలాల గుండా ప్రవహించి చింతపల్లివద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై ఆండ్ర రిజర్వాయర్‌తో పాటు కుమిలి గ్రోయిన్, డెంకాడ ఆనకట్ట తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలోని మండలాలతో పాటు అదనంగా విజయనగరం, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు, గరివిడి, భోగాపురం మండలాలకు తాగునీటిని అందించే పథకాలు నదిలోనే ఉన్నాయి. సుమారు 8లక్షల మందికి నదిలోని పథకాలు తాగునీటిని అందిస్తున్నాయి. వేసవిలో అప్పుడప్పుడూ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తినా, చాలావరకు ఇబ్బంది ఉండదు. తాగునీటికి ఇబ్బందే.. ఈ ఏడాది మాత్రం వేసవిలో తాగునీటి పథకాలు చాలా వరకు పడకేసే ప్రమాదముంది. ఇంకా వేసవి ప్రారంభం కాకముందే నదిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. వాటర్ గ్యాలరీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో తప్ప చాలాచోట్ల నదీగర్భం ఎడారిని తలపిస్తోంది. రానున్న వేసవిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే అవకాశముందని నీటిసరఫరా విభాగం అధికారులు అంటున్నారు. ముఖ్యంగా విజయనగరం పట్టణానికి సరఫరా చేసే రామతీర్థం మంచినీటి పథకంతో పాటు నెల్లిమర్ల మున్సిపాలిటీకి చెందిన పథకాలన్నీ పడకేసే ప్రమాదం పొంచి ఉంది. వరుణుడు కరుణించి అడపాదడపా వర్షాలు కురిస్తేగాని ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. -
ఎడారిలో జలవృక్షం..
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన ‘హోప్ ట్రీ’ డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి చేరుతుంది. ఇంకేం.. అక్కడి నుంచి బిందెలతో తీసుకెళ్లడమే. అన్నట్టూ.. మంచినీటికి తీవ్ర కరువు ఉన్న ప్రాంతాల్లో గాలిలో తేమ నుంచి మంచినీటి తయారీ కోసం కొందరు శాస్త్రవేత్తలు ఇదివరకే ఇలాంటి కొన్ని డిజైన్లను ఆవిష్కరించగా.. మరింత సులభం, చౌక అయిన పద్ధతుల కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నారు.