Design of buildings
-
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్ ఏర్పడింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చు. -
భవనాలు.. పచ్చిక బయళ్లు
♦ రాజ్పథ్లా రాజధాని పరిపాలన భవనాల డిజైన్ ♦ అమరావతి ఐకానిక్ నిర్మాణాల్లో అసెంబ్లీకే ప్రథమ ప్రాధాన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి పరిపాలనా భవన సముదాయాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ నమూనాలో నిర్మించేందుకు జపాన్‌కు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్ డిజైన్ రూపొందించింది. రాజ్‌పథ్‌లో రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద లాన్లు, చెట్లు విస్తరించి ఉంటాయి. అదే తరహాలో ఇక్కడ కొంచెం మార్చి రెండు వైపులా భవనాలు నిర్మించి మధ్యలో పొడవునా లాన్లు, పార్కులు, స్థూపాలు నెలకొల్పుతున్నారు. ఏ భవనం నుంచి బయటకు వచ్చినా అక్కడ విశాలైన పార్కులు, కాలువలు, టవర్లుండేలా చూడడం ద్వారా సందర్శకులను ఆకట్టుకునే ఏర్పాట్లు చేయనున్నారు. తుళ్లూరు వైపున పాలవాగు వద్ద ప్రవేశ మార్గం ఏర్పాటు చేసి మధ్యలో పలు కాలువలు, చెరువులతో ఆహ్లాదవాతావరణాన్ని కల్పించి చివరికి కృష్ణానదీ తీరం వరకూ దాన్ని విస్తరించారు. భవన సముదాయంలో నిర్మాణ నిబంధనలన్నీ సెంట్రల్ ఢిల్లీలో అమలయ్యే అర్బన్ డిజైన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 900 ఎకరాల్లో 30 శాతం విస్తీర్ణాన్ని పూర్తిగా పచ్చదనానికి కేటాయించనున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ప్రత్యేక రూమ్ భవన సముదాయంలో ఐకానిక్ నిర్మాణాలుగా అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలను ఎంపిక చేసినా ఆ రెండింటిలోనూ లెజిస్లేచర్ భవనానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజధానిలో అద్భుత కట్టడంగా దీన్ని మలిచేందుకు అనువుగా డిజైన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే పోటీలో పాల్గొన్న ఆర్కిటెక్ట్‌లకు సూచించింది. ఎంపికైన మకి అసోసియేట్స్ ప్రతిపాదించిన డిజైన్‌లో ఈ భవనాలే ఆకర్షణలుగా ఉన్నాయి. వీలైతే వీటిని పాలరాతితో తాజ్‌మహల్ తరహాలో నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. భవనాల పైకప్పులన్నీ సోలార్ ప్యానల్స్‌తో నిండి ఉండేలా డిజైన్ ఉండడంతో పాలరాతిని ఎలా బయటకు చూపించాలనే దానిపై ఆర్కిటెక్ట్‌లు అధ్యయనం చేస్తున్నారు. ఎంపికైన డిజైన్ ప్రకారం లెజిస్లేచర్ భవనాలు నాలుగు బ్లాకుల్లో ఉంటాయి. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలున్నా భవిష్యత్తులో 225.. అంతకంటె సంఖ్య పెరిగినా సరిపోయేలా అసెంబ్లీ హాల్‌ను పెద్దగా ఏర్పాటుచేస్తారు. అసెంబ్లీలో సీఎం వెయిటింగ్ హాల్, ముఖ్యమంత్రి సూటు ప్రత్యేకంగా ఉంటాయి.అక్కడినుంచి అసెంబ్లీలో జరిగే చర్చను చూసే ఏర్పాటు ఉంటుంది.మరో బ్లాకులో శాసనమండలి సభ్యుల కోసం కౌన్సిల్ హాలు దాని కంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడా సీఎం సూటు, వెయిటింగ్ హాలు ఉంటాయి. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు రెండింటినీ పెద్ద, చిన్న జంట భవనాలుగా ప్రతిపాదించారు. ఈ భవనాల్లోకి నేరుగా సూర్యకాంతి పడేలా డిజైన్ చేశారు. స్పీకర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. : అసెంబ్లీలో స్పీకర్, కౌన్సిల్లో చైర్మన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిపాదించారు. మూడో బ్లాకులో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు సంయుక్తంగా నిర్వహించే సమావేశాల కోసం పెద్ద సెంట్రల్ హాలుతో భవనాన్ని నిర్మించనున్నారు. నాలుగో బ్లాకులో లెజిస్లేచర్‌కు చెందిన లైబ్రరీని నెలకొల్పుతారు. అసెంబ్లీకి ప్రత్యేకంగా పరిపాలనా భవనం, కౌన్సిల్‌కు పరిపాలనా భవనాలు వాటి పక్కనే నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడంతో దాన్ని తగ్గించేం దుకు వీలైనంత గ్రీనరీ, కాలువలను చుట్టూ ఏర్పాటుచేస్తున్నారు. లెజిస్లేచర్ భవనాల్లో 654 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది.లెజిస్లేచర్ భవనాల్లోకి వచ్చేందుకు సీంకు ప్రత్యేక మార్గం ఉంటుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్, సచివాలయానికి వెళ్లేందుకు దగ్గరి మార్గాలుంటాయి. మంత్రులు, పాలనా సిబ్బంది, మీడియా-సందర్శకుల కోసం విడివిడిగా ప్రవేశమార్గాలు ఉంటాయి. -
హరిత భవనాలపై ఆసక్తి..
విద్యుత్ పొదుపుతో పాటు గ్లోబల్ వార్మింగ్కూ పరిష్కారం ‘మెట్రో పొలిస్’ సదస్సులో ఆసక్తికర చర్చ హైదరాబాద్: హరిత గృహాలు (గ్రీన్ బిల్డింగ్స్).. పర్యావరణ స్నేహశీలిగా ఉండే ఈ భవనాలపై ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విచ్చలవిడిగా వనరుల వినియోగం, మానవ తప్పిదాల మూలంగా గ్లోబల్ వార్మింగ్ రూపంలో ఎదురవుతున్న ముప్పుకు హరిత భవనాలను చక్కటి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ భవనాల డిజైన్, నిర్మాణం సమయంలోనే కాదు వాటి నిర్వహణ, విని యోగం, నవీకరణ, కూల్చివేత సమయంలోనూ పర్యావరణానికి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్, నీరు, గాలి తదితర వనరులను అత్యంత పొదుపుగా విని యోగిస్తూ.. అన్ని అవసరాలను తీర్చగలిగేలా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో హరిత భవనాలను నిర్మిస్తున్నారు. ‘మెట్రో పొలిస్’ సదస్సు లో బుధవారం హరిత భవనాలపై జరిగిన చర్చ అందరినీ ఆలోచింపజేసింది. హరిత భవనాల తో భూతాపాన్ని నిరోధించవచ్చని వక్తలు పలు ఉదాహరణలతో వివరించారు. సదస్సులో చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల సంఘం ఆధ్వర్యంలో ఆ దేశంలో విద్యుత్ పొదుపుకోసం కృషి చేస్తున్న ప్రాజెక్టు డిప్యూటీ డెరైక్టర్ యెవ్ మోన మాట్లాడుతూ.. చైనాలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో 16 శాతం విద్యుత్‌ను పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. హరిత భవనాల సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏసీల్లో దాదాపు 10 శాతం ఆదా అవుతుందని ఏసీల కంపెనీ ‘క్యారియర్’ ఆపరేషన్స్ డెరైక్టర్ రాహుల్ గార్గ్ పేర్కొన్నారు. కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆ పరిజ్ఞానాన్ని విని యోగిస్తే.. ఏడాదికి రూ. 200 కోట్ల వరకు పొదుపు చేయవచ్చన్నారు. హరిత భవనాల నిర్మాణ రంగంలో కృషిచేస్తున్న ‘జీఐబీఎస్ఎస్’ కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రామ్‌దాస్ మాట్లాడుతూ థర్మల్ సిస్టమ్ కాన్సెప్ట్‌తో పనిచేసే ఏసీలను వినియోగిస్తే 70 నుంచి 80 శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నా రు. ఉత్పాదక రంగం, ఏసీల వినియోగం, వాహనాల రవాణా వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి పోయి జన జీవనంపై దుష్ర్పభావం పడుతోం దని అస్కీ అధ్యాపకుడు రాజ్‌కిరణ్ పేర్కొన్నారు.