కొంప కూల్చేసింది.. రోడ్డు చిత్తడి చేసింది
డార్జిలింగ్: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఓ భారీ కొండచరియ వారి ఇంటిని నేలమట్టం చేసింది. దాని దాటికి ఇళ్లు నామరూపాల్లేకుండా పోయింది. దీనికితోడు ఆ ఇంటి పక్కనే ఉన్న ప్రధాన రహదారి కూడా ధ్వంసమైంది. డార్జిలింగ్ జిల్లాలోని కలింపాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సిక్కింను కలింపాంగ్ ప్రాంతానికి కలిపే ఏకైక రహదారి ఇదే కావడంతో భారీ స్థాయిలో విరుచుకుపడిన కొండచరియల కారణంగా దాదాపు 300 మీటర్ల ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, నష్టం భారీ స్థాయిలో కనిపిస్తున్న ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.