నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఆదిలాబాద్ : అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ,దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం కురిసిన భారి వర్షం వల్ల దిలావర్‌ఫూర్‌లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నివేదిక అందజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అందరికీ పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. ఆయన వెంట మండల ముఖ్యనేత దేవేంధర్‌రెడ్డి, నాయకులు నర్సారెడ్డి, రమణారెడ్డి, ధనెనర్సయ్య, ఆత్మ డెరైక్టర్ గుణవంత్‌రావుపాటిల్,ధనె రవి, కే.గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
(దిలావర్పూర్)