Devaraj reddy
-
శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్, సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్టయి చంచలగూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దేవరాజ్, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు. -
శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు..
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో ఫోన్లో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న ఆయన బుధవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు. (శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!) అనంతరం అశోక్ రెడ్డిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత అశోక్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జి ముందు ప్రవేశపెట్టి...న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయం విదితమే. (శ్రావణి కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి లొంగుబాటు) అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు.. శ్రావణి ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది..?? ఆమెతో ఉన్న పరిచయం ఏంటి..?? సాయి కృష్ణ రెడ్డి తో కలిసి శ్రావణిని ఏం బెదిరించారు..?? శ్రావణి ని వివాహం చేసుకుంటానని ఆ తరువాత సాయి కృష్ణారెడ్డితో కలిసి ఎందుకు వేధించారు..?? అనేక ప్రశ్నలకు సమాధానం రాబడుతున్న ఎస్సార్ నగర్ పోలీసులు -
నవంబర్ నుంచి సీఏ సిలబస్ మార్పు
- ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు దేవరాజ్ రెడ్డి వెల్లడి లబ్బీపేట: దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ నుంచి సీఏ సిలబస్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం.దేవరాజ్ రెడ్డి తెలిపారు. ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ‘జ్ఞానశిఖర’ పేరుతో చార్టెడ్ అకౌంటెంట్స్ సబ్ రీజినల్ కాన్ఫరెన్స్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐసీఏఐ ఇచ్చే సిలబస్‌తో మూడేళ్లపాటు ప్రణాళికాబద్ధంగా ఆర్టికల్స్ చేస్తేనే సీఏ పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. రైల్వేలో డబుల్ అకౌంటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీఏఐ విజయవాడ చాప్టర్ చైర్మన్ కె.శివరామకుమార్, వైస్ చైర్మన్ జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.