ఇన్ఫ్రా పరుగులు...
• అక్టోబర్లో 6.6 శాతం
• ఆరు నెలల గరిష్ట స్థారుుకి వృద్ధి
• స్టీల్, రిఫైనరీ రంగాల మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: మౌలిక రంగ వృద్ధి అక్టోబర్లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. వరుసగా మూడో నెల కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గింది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్లో కేవలం 3.8 శాతంగానే ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో మౌలిక రంగం వాటా 38 శాతం. ఈ రంగం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 4.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 2..8 శాతం మాత్రమే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాలను విడుదల చేసింది.
⇔ అక్టోబర్లో స్టీల్ ఉత్పత్తి రెండంకెల స్థారుులో 16.9 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.5 శాతం.
⇔ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సైతం 15.1 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది అక్టోబర్లో ఇది కేవలం 4.4 శాతంగా ఉంది.
⇔ 2015 అక్టోబర్లో ఎరువుల ఉత్పత్తి 16.8 శాతంగా ఉండగా తాజాగా అది 0.8 శాతానికి పడిపోరుుంది. సిమెంట్ ఉత్పత్తి సైతం 13.8 శాతం నుంచి 2.8 శాతానికి క్షీణించింది.
⇔ బొగ్గు ఉత్పత్తి 6.6% నుంచి 1.6%కి, సహజ వారుువు ఉత్పత్తి 1.4%కి, ముడి చమురు ఉత్పత్తి 3.2 శాతానికి తగ్గింది.