సైన్స్ విజన్
జపాన్ టూర్‌పై విద్యార్థుల ఆనందం
సాక్షి, సిటీబ్యూరో: మానవాళి మనుగడ, అభివృధ్ధిలో సైన్స్ ప్రాధాన్యత... అది విద్యార్థులకు కెరీర్ పరంగా అందించే విజయాలు... జపాన్ పర్యటన తె లియజెప్పిందని నగరానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ సైన్స్ టెక్నాలజీ ఏజెన్సీ ‘సకురా సైన్స్ ప్రోగ్రామ్’లో భాగంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు 25 మంది జపాన్‌లో పర్యటించారు. నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారు అక్కడి విశేషాలను పంచుకున్నారు. ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, క్యోటో యూనివర్సిటీ సందర్శన, టోక్యోకు బుల్లెట్ రైలు ప్రయాణం, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టె క్నాలజీ, టోక్యో ఎమెర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ మ్యూజియం... వంటివి సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని అందించిందని వివరించారు. ఇదొక విజ్ఞాన, వినోదాల మేలు కలయికగా సాగిన పర్యటన అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనిరెడ్డి, టీచర్ మేరియాన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు.