రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ. 33 కోట్లు మంజూరు
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ అభివృద్ధి విభాగ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, మరమ్మత్తులకు రూ.33.30కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ సెంట్రలైజ్డ్ పాఠశాలలకు రూ.23.62కోట్లు, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ.7.5కోట్లు, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు రూ.5కోట్లు మంజూరు చేసింది.
అంగన్వాడీలకు రూ.9.23కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే ప్రీ స్కూల్ కిట్ల కోసం తొలివిడతగా రూ.9.23కోట్ల నిధులు ప్రభుత్వం మంగళవారం మంజూరు చేసింది. అలాగే కిషోరశక్తి యోజన పథకం అమలుకు రూ.60లక్షలు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు రూ.48లక్షలు మంజూరయ్యాయి. కాగా, హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన దొడ్డి కొమరయ్య కురుమ భవన్ కోసం రూ.5కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఓబీసీలకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్పుల నిమిత్తం రూ.12.32 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.