జై మాతాదీ
సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత.. త్రిలోకేశ్వరీ సకలాభీష్ట ప్రదాయిని దేవి నవరాత్రోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల నిర్వహించే ఈ ఉత్సవాలు కోసం వాడవాడల్లో యుజవన సంఘాలు, ఉత్సవ కమిటీలు, ఫ్రెండ్స్ యూనిట్ల ఆధ్వర్యంలో మంటపాలు ఏర్పాటు చేశారు.
– కరీంనగర్ కల్చరల్
తొలి పూజ: నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం దుర్గామాతకు తొలిరోజు తొలి పూజలు నిర్వహిస్తారు.
దేవీ నవరాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రుల్లో తొలిరోజు అమ్మ వారికి కలశస్థాపనం చేసి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి విజయదశమి వరకు దేవీనవరాత్రులు నిర్వహిస్తారు.
తొమ్మిది అవతారాలు : శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి అయిన దుర్గామాతను శైలప్రతిథీ, బ్రహ్మచారిణి, చంద్రఘంటే , కూష్మాండేతి, స్కంధ మాతేతి, కాత్యాయనీతి, కాళరాత్రిచ, మహాగౌరీతి, సిద్ధిరాత్రి తొమ్మిది అవతారాల్లో భక్తులు కొలుస్తారు.
దుర్గా ౖవైభవం : పూర్వం దుర్గుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుండా, దేవతాలందరూ ఒకచోటచేరి శక్తి స్వరూపం సమైక్య రూపంగా రూపొందించారు. శివశక్తి నుంచి శిరస్సు, విష్ణుశక్తి నుంచి భుజములు, బ్రహ్మశక్తి నుంచి చరణములు, ఇంద్రశక్తి నుంచి నడుము, కుభేరశక్తి నుంచి కేశం, పధ్వినుంచి పిరుదులు అవిర్భవించగా స్త్రీశక్తి దుర్గగా అవతరించిందని పురాన గాథ.
ప్రీతి పాత్రమైన రోజులు : రుద్ర రూపిణి భద్రకాళిగా ఎనిమిదో రోజు జన్మించిన చాముండి తొమ్మిదో రోజు వీరవిహారం చేసి దైత్య సంహారం చేసిందని పురాణాల్లో పేర్కొన్నారు. పదోరోజు విజయలక్ష్మిగా జనుల ఆనందోత్సవాలకు ప్రతీకగా పూజలందుకుంటుంది. న వరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటినే మనం దుర్గాష్టమి, విజయదశమి పేరిట ఉత్సవాలు జరుపుకుంటాం.
ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం
దేవి నవరాత్రోత్సవాలకు నగరంలోని చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయం ప్రత్యేక అలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీమహాదుర్గగా, శ్రీ మహాలక్ష్మిగా, శ్రీమహాసరస్వతిగా ఒకే ప్రాంగణంలో పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి ప్రాణప్రతీష్ఠతో కొలువుదీరిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుందనే విశ్వాసంతో ఈ దేవాలయానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగడం విశేషం. ఈ దేవాలయంలో వైధిక, సాంస్కృతిక, అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ విసృత ఏర్పాటు చేసింది.