devireddy subramanyam reddy
-
అప్పుడే విశాఖ రాజధాని
అత్యధిక మంది తెలుగు మాట్లాడే జిల్లాలతో కూడిన ప్రత్యేక ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడాలనే భాషాపరమైన సెంటిమెంటును ఇరవయ్యవ శతాబ్ది రెండవ దశాబ్ది ఆరంభం నుండి వ్యాప్తిగావించడంతో బాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలని తీవ్రంగా ఉడుంపట్టుబట్టిన వారిలో ‘ఉత్తర సర్కారు’ జిల్లాల నాయకులు ముఖ్యులు. వారి కోరిక, ఒత్తిడుల కారణంగా 1953 నాటి కేంద్రప్రభుత్వం అక్టోబర్ ఒకటవ తేదీ 1953న ‘ఆంధ్రరాష్ట్రం’ను ఏర్పరచింది. దీని కొనసాగింపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని తెలుగు జిల్లాల ఎమ్మెల్యేలు (140 మంది) మూజువాణి ఓటుతో కర్నూలును రాజధానిగా (1937 శ్రీబాగ్ ప్రకారం) నిర్ణయించడం జరిగింది. గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఆనాటికి ఆంధ్రరాష్ట్రంలో, ముఖ్యంగా నాలుగు మధ్య ఆంధ్ర జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకుల్లో, మరింత ప్రధానంగా ఆ జిల్లాల కాంగ్రెస్ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్ (20 మంది శాసనసభ్యులు) నాయకుల్లో ఒకవైపు విజయవాడ–గుంటూర్లను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన; మరోవైపు ఉమ్మడి ఏపీని, దాని రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పరచుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, అప్పటి ‘హైదరాబాద్ స్టేట్’లోని తెలంగాణ వారిలో మాత్రం ఉమ్మడి ఏపీ ఏర్పాటు, దానికి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వంటి ఆలోచనలు 1953 నాటికి ఉండేవి కాదు. అయినప్పటికీ, సర్కారు జిల్లాల నాయకులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు కర్నూలు నుండి రాజధానిని మార్చాలని ఆంధ్ర రాష్ట్రం, రాజధాని కర్నూలు పుట్టిన రెండు నెలలలోపే తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఆలస్యం చేస్తే ఎలాంటి మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయో అన్నట్లు నాటి కర్నూలులోని శాసనసభ పలు దఫాలుగా, ‘ఆంధ్రరాష్ట్ర రాజధాని విషయంగా’ చర్చలు జరిపి, నవంబర్ ముప్పయ్ 1953న కర్నూలు రాజధాని మార్పు గురించి తీర్మానం చేసింది. అందులో, ఏప్రిల్ ఒకటవ తేదీ 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధానిని ఉంచాలని, ఆ తరువాత విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధాని చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు రాగా, తటస్థులుగా 20 మంది (కమ్యూనిస్టులు) ఉన్నారు. ఉమ్మడి ఏపీ, దాని రాజధానిగా హైదరాబాదు ఏర్పాటు జరుగుతాయోలేదో తెలియకముందే మూడేళ్ల ముందే కర్నూలు రాజధానిని మార్చడంపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా, రాజధానిపై, 1953లో మద్రాసులో ఒకసారి, కర్నూలులో మరోసారి అసెంబ్లీ చర్చించడం, ఒకసారి కర్నూలును, మరోసారి విశాఖను రాజధానిగా నిర్ణయించడానికి కారణం పంతొమ్మిదవ శతాబ్దిలో గోదావరి, కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నాలుగు జిల్లాల్లో మెరుగైన ఆర్థిక, సాంఘిక మార్పులు జరగడం వలన ఆంధ్రరాష్ట్రం ఏర్పరచుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు భావించడం, విజయవాడ, గుంటూర్లలో రాజధానిని ఏర్పరచుకొని ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాలనే బలమైన కోరిక వారిలో ఉండడమే. కానీ విజయవాడ, గుంటూరులు రాజధానిగా ఎన్నుకోకపోవడంతో ఆ జిల్లాల వారు ఉమ్మడి ఏపీ ఏర్పాటుపై కేంద్రీకరించి, తమకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకోవడం జరిగింది. అంటే, 1937 నాటి శ్రీబాగ్ ప్రకారం పొందిన కర్నూలు రాజధాని, లేదా, ఒక ప్రభుత్వపాలనా విభాగాన్ని తిరిగి పొందాలని, నవంబర్ ముప్పయ్ 1953న అసెంబ్లీ తీర్మానం ప్రకారం, విశాఖ పొందిన శాశ్వత రాజధానిని తిరిగి పొందాలని, అదే నవంబర్ ముప్పయ్ 1953న వస్తుందనుకొన్న రాజధానిని తిరిగి విజయవాడ, గుంటూర్లకు రావాలని మూడు ప్రాంతీయుల్లోనూ ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షలన్నీ తీర్చడానికే నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావతిలో లెజిస్లేచర్ విభాగాన్ని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని, కర్నూలులో జ్యుడీషియల్ విభాగాన్ని ఏర్పరచడానికి అసెంబ్లీలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించడం జరిగింది. డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ -
జనయోధుడు తుర్రేబాజ్ ఖాన్!
ఆయనొక సామాన్యుడు. కానీ నిజాం రాజ్యవీరులకే వీరుడు. హైదరాబాద్ శూరులకే శూరుడు, బేగంపేట గల్లీకే గర్వకారకుడు. తెలుగునేలలో జనంవైపు నిలిచిన జనప్రియుడు. నేటి కోఠీ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉండిన నాటి బ్రిటిష్ రెసిడెన్సీపై 1857 జూలై 17న ఐదువేలమందితో ముట్టడి చేసి వలసపాలకులను వణికించిన ధీరుడు. ఆయన ఎవరో కాదు. మనందరం మర్చిపోయిన తుర్రేబాజ్ ఖాన్. ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంలో హైదరాబాద్ హీరోయే కాని ట్యాంక్ బండ్ శిల్పాల సరసన స్థానం దక్కని అనాథ. బ్రిటిష్ వారి పెత్తనాన్ని, దోపిడీని తీవ్రంగా ద్వేషించిన తుర్రేబాజ్ తన కల నిజం కాకముందే హైద్రాబాద్ సమీపాన తూప్రాన్ వద్ద నిజాం–బ్రిటిష్ బలగాలతో జరి గిన పోరులో 1859 జనవరి 23న ప్రాణాలర్పించాడు. జనంలో భయం కలి గించడానికి తన శవాన్ని హైదరాబాద్‌లోని బేగంబజార్‌లోని తన నివాసంలోనే చెట్టుకు వేలాడదీశారు. 1857 నాటికి నిజాం రాజ్యంలో, దేశం మొత్తంలో సంభవిస్తుండిన రాజకీయ పరి ణామాలకు తుర్రేబాజ్ ప్రభావితుడై ఆంగ్లేయులంటేనే రగిలి పోయేవాడు. తొలుత ఫెస్కల్, మాన్ కడప్, గుల్బర్గా వంటి ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్ని చేపట్టి శిక్షలు కూడా అనుభవించాడు. 1857 జూలై 17న హైదరాబాద్‌లోని మక్కామసీదుకు వెళ్లిన తుర్రాబాజ్ అక్కడి మౌల్వీలు, ఇతర పెద్దలు బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించాలని తీసుకున్న నిర్ణయాన్ని విని ఆవేశంతో మత జెండాను చేతబట్టుకుని, గుర్రంపై బేగంబజారుకు వెళ్లి రొహిల్లాలు, అరబ్బులు, విద్యార్థులు, బ్రాహ్మణులు, బ్యాంకర్లు, వ్యాపారులు, ఇతరులను అయిదువేలమందికి పైగా కూడగట్టుకుని కోఠీ లోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించాడు. ఇదే తరుణంలో, అప్పటికే రహస్య మంతనాలతో తనకు అనుకూలంగా తుర్రేబాజ్ మార్చుకోగలిగిన ఇస్లాం మత బోధకుడు, నగరంలో అత్యంత గౌరవనీయుడుగా పేరుగాంచిన మౌల్వీ సయ్యద్ అల్లా ఉద్దీన్ కూడా తన అనుచరగణంతో పుత్రీబౌ మీదుగా పయనించి రెసిడెన్సీ నైరుతి కొస ప్రాంతానికి చేరుకొన్నాడు. రెసిడెన్సీ పశ్చిమ గోడకు ఎదురుగా రెండు పెద్ద గృహాల్ని, దిల్షుక్ గార్డెన్‌ని స్వాధీనపర్చుకున్నారు. ఒక రెండు రెసిడెన్సీ గేట్లను విరగ్గొట్టారు. బ్రిటిష్ సైనికులకు, తిరుగుబాటుదార్లకు మధ్య తుపాకీలతో పోరాటం 1857 జూలై 18 తెల్లవారు జామును నాలుగుగంటల వరకు కొనసాగింది. ఇక పోరాటం కొనసాగించడం కష్టమని భావించి తుర్రేబాజ్, అల్లావుద్దీన్ అదనపు బలగాల సేకరణకు అక్కడినుంచి నిష్క్రమించారు. 1857 జూలై 22న తుర్రేబాజ్ ఖాన్ బందీగా పట్టుబడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వం తనకు జీవితాంతం ఖైదీగా అండమాన్‌లో గడపాలని శిక్ష విధించింది. అయితే 1858 జనవరి 23న జైలునుంచి తప్పించుకున్నాడు. కానీ ఇతని కోసం తీవ్రమైన గాలింపు చర్యలను చేపట్టారు. కడకు 1859 జనవరి 23న కుర్బాన్ ఆలీ ఆధీనంలోని సాయుధ బలగాల చేతిలో తూప్రాన్ వద్ద పట్టుబడగా బ్రిటీష్ పాలకులు వెనువెంటనే తనని చంపివేశారు. అతడి శవాన్ని హైదరాబాద్‌లోని బేగంబజారులో ఉన్న తన నివాస ప్రాంతానికి తెచ్చి ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడదీశారు. జనం కోసం, బ్రిటిష్ పాలన అంతం కోసం, నిజాం పాలననుంచి విముక్తి కోసం వీరమరణం పొందాడు తుర్రేబాజ్ ఖాన్. అధికారం కాపాడుకోవడం కోసం బ్రిటిష్ వారికి ఆద్యంతం తొత్తులుగా వ్యవహరించిన నిజాం, సాలార్ జంగ్ల కోసం కాకుండా బ్రిటిష్ వారిపై పోరాడిన తుర్రాబాజ్, అల్లావుద్దీన్‌లను గుర్తు తెచ్చుకోవడం మన కనీస ధర్మం. ఈ వ్యాసానికి మూలం వ్యాసకర్త రచించిన ‘అప్ రైజింగ్ ఆప్ 1857’ గ్రంథం. డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్సిటీ మొబైల్ : 98495 84324 -
‘హోదా’ రాకుండా చేసింది చంద్రబాబే!
సందర్భం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి తొలి ముద్దాయి బీజేపీ. రెండో ముద్దాయి కాంగ్రెస్ కాగా అసలు ముద్దాయి మాత్రం టీడీపీనే అని చెప్పాలి. విభజన చట్టంలో స్పష్టత ఉన్న హక్కులు కొన్నింటిని, స్పష్టత లేని హక్కులు కొన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. హోదాను స్పష్టత ఉన్న హక్కుల్లో చేర్చి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ అలా చేయలేదు. కనీసం బీజేపీ అయినా విభజన చట్టం ముసాయిదాను అందుకున్న సమయంలోనే, ఏపీకి అన్ని హక్కుల్ని స్పష్టంగా ఇవ్వాలని, హోదాను కూడా అందులో చేర్చాలని నాటి ప్రభుత్వాన్ని కోరి ఉండవచ్చు. అలా చేయకపోగా కొత్తగా కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చిన తర్వాతయినా పాత ప్రభుత్వం ఆమోదించి ప్లానింగ్ కమిషన్‌కు పంపిన హోదాను బీజేపీ అమలు జరిపి ఉండవచ్చు. ఆ పనీ చేయలేదు. పైగా హోదా కోసం కొత్తగా చట్టాన్నీ చేయలేదు. హోదా విషయంలో భంగపాటుకు అసలు కారకుడు చంద్రబాబే. హైదరాబాద్‌ను కోల్పోయి ఆర్థిక అంగవైకల్యం చెందిన కొత్త ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్లు హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బీజేపీ కూడా పదేళ్లు హోదా ఇవ్వాలని భావించింది. కానీ టీడీపీతో 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, ఆ తర్వాత మిత్రపక్షంగా ఉండటం, సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో నడపడంతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి సంబంధించిన ప్రధాన అంశాల్లో చంద్రబాబుతో సంప్రదించి నిర్ణయం తీసుకోసా గింది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉండగా, తనకు తనపార్టీకి, తన సన్నిహితులకు లాభం ఉంటుందని భావించిన బాబు పోలవరం విషయంలో కేంద్రాన్ని ఒప్పించారు. ఇదేవిధంగా హోదా విషయంలో చంద్రబాబుతో పలు దఫాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్చించింది. హోదా బదులు ప్యాకేజీని ఏపీకి ఇవ్వాలని బాబు పట్టుబట్టడం, ఒత్తిడి పెట్టడం చేశారు. హోదా ఇస్తే అప్పటికే పలు రూపాల్లో హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఆయన పార్టీకి రాజకీయంగా మరింత బలం పెరుగుతుందని అనుమానించి, ఒక దశలో హోదాను ఇవ్వాలనుకున్న బీజేపీని ఇవ్వకుండా చేసి ప్యాకేజీకి సిద్ధపడిపోయారు. తన కోరిక ప్రకారమే కేంద్రం హోదా ఇవ్వలేదు కాబట్టి వైఎస్ జగన్ చేస్తున్న హోదా ఉద్యమాన్ని బలహీనపర్చబోతున్నాననే ఆనందంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను నిమిషాల్లోనే ఆమోదించడం, జైట్లీకి, లాబీయింగ్ జరిపిన వెంకయ్యకు అభినందనలు తెలపడం, అసెంబ్లీలో అభినందన తీర్మానాలు చేయడం జరిగిపోయాయి. పైగా హోదా కోసం ఆందోళనలు చేస్తే చట్టం తన పనిచేస్తుంది, ఉద్యమిస్తే విద్యార్థులు ఉండేది జైల్లోనే అంటూ బెది రింపులకు దిగారు. ప్రతిపక్షనేత జగన్‌ని, ఇతర పార్టీల నాయకుల్ని, విద్యార్థుల్ని అరెస్టు చేయిం చాడు. హోదా రాకున్నా, ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి పరి శ్రమలు పరిగెత్తి వస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని బిల్డప్ మాటలతో కేంద్రం హోదాను ఇవ్వాల్సిన అవసరం లేదని సంకేతాలు పంపసాగాడు బాబు. ఇలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్ని సృష్టిం చాడు. మరోవైపున పోలవరం, రాజధాని తదితర అంశాల్లో కేంద్ర నిధుల వాడకంపై లెక్కలు చెప్పకపోవడంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల రాక ఆలస్యం కాసాగింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాలన్నింటికీ తానే కారణమైనా, బీజేపీ మోసగించిందంటూ ప్రజ లను మళ్లీ ఏమార్చుతున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ జనం ఇప్పుడు నమ్మదగిన నేతగా వైఎస్ జగన్‌ను కీర్తిస్తున్నారు. ఆయనను చూట్టానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి తండ్రి వైఎస్సార్ పాదయాత్రకు మించి లక్షలాదిగా జనం బయటకు వస్తున్నారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు హోదా రాగం ఎత్తుకున్నాడని బాబును తిట్టిపోస్తున్నారు. జనం సమస్యలు పట్టని మూడు దఫాల సీఎంను కాపాడటానికి పచ్చమీడియా, ఉద్యోగ సంఘాలు, ముసుగు సంఘాలు, జనసేన వంటి పార్టీలు కూడా టీడీపీకి సేఫ్టీ వాల్వులు లాగా పనిచేస్తుండటం విచారకరం. వీరంతా ఇప్పటికైనా మేల్కొంటే మంచిది. - ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త విశ్రాంతాచార్యులు, చరిత్రశాఖ, ఎస్వీయూ, తిరుపతి ‘ 98495 84324 -
ప్యాకేజీతో మిగిలేది శూన్యం
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అంటే తిరిగి చెల్లించాల్సిన అప్పు. గ్రాంట్ అంటే దానం. పాతకాలపు మాటల్లో ఇనాం అని అర్థం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇచ్చేది కూడా దాదాపు దానమే. (తొంభై శాతం గ్రాంటు అని పిలిచే దానం, పది శాతం అప్పు). పూర్వకాలంలో రాజులు ధనదానం, ధాన్యదానం, భూదానం, ఖజానాకు వచ్చే పన్నుల దానం వంటి దానాలు చేసేవారు. వీటిని ప్రధానంగా సాగునీటి వసతులు కల్పించే వారికి (దశబంధం ఇనాంలు), ఆలయ నిర్మాణాలు-నిర్వహణలకు (దేవాల యాల ఇనాంలు), విద్య- అర్చక సేవలు చేసే బ్రాహ్మ ణులకు; పాఠశాలలు, అన్నదాన కేంద్రాలు, సత్రాలు, చలివేంద్రాలు వంటి వాటి నిర్వహణలకు ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వ దానం (గ్రాంటు) నేడు రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా ప్రజలకు, సంస్థలకు, పరిశ్రమల వంటి వాటికి అత్యధిక మేలు జరుగుతున్నది. తుపాన్లు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలైనట్లు, నవ్యాంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా కూలబడి ఉంది. అందుకే ఇలాంటి కేంద్ర దానం అవసరం. మరోవైపు సహాయం రూపంలో కూడా కేంద్రం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఆర్థికంగా చేయూత నిస్తుంది. ఉదాహరణకు విదేశీ ఆర్థిక సహాయంతో రాష్ట్రం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు వంటివాటికి, నదుల అనుసంధానం, నదుల క్షాళన, ఓడ రేవుల నిర్మాణం, మెట్రో ప్రాజెక్టులు వంటి వాటికి విదేశా లకు రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు, వడ్డీలను కేంద్రమే చెల్లించి, ఆర్థికభారం తగ్గించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడు తుంది. అంటే, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పోలవరం, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులే గాక కొత్తగా మరెన్నో ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చుల్ని భరిస్తుంది. పరిశ్రమల స్థాపనకు, వ్యవసాయ రంగాభివృద్ధికి అవస రమైన విద్యుదుత్పాదన కేంద్రాల నిర్మాణ ఖర్చుల్నీ కేంద్రమే భరిస్తుంది. కుంటుపడిన ఆర్థిక పరిస్థితి బాగుపడేట్లు చేస్తుంది. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు వచ్చే సహాయం కూడా రాష్ట్రాల మ్యాచింగ్ గ్రాంట్‌తో ప్రమేయం లేకుండానే పెద్ద మొత్తంలో వస్తుం ది. అంటే గ్రామీణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి, వెనుకబ డిన జిల్లాల అభివృద్ధి, డ్రాప్ అవుట్ పిల్లల విద్య కొనసా గింపు వంటి కార్యక్రమాలకు వచ్చే నిధులు కేంద్రం నుంచి దాదాపు దానంగానే వస్తాయి. దీనితో ఆయా పరిధులలో అభివృద్ధి జరిగి, ప్రాంతీయ అసమానతలు తగ్గించుకోవడానికి ఇలాంటి రాష్ట్రాలకు వెసులుబాటు చిక్కుతుంది. మరోవైపు ఎకై్సజ్ సంకాలు, కస్టమ్స్ సుం కాలు, ఆదాయపు పన్నులు, కార్పొరేట్ పన్నులు వంటి వాటిలో కేంద్రం మినహాయింపులు ఇస్తుంది. ఈ మినహాయింపులు వలన ఇలాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించాలనుకొనే వారికి మిగులు సాధ్యమై ఆదా యాలు పెరుగుతాయి. తక్కువ ధరకు తమ సరకులు అమ్మకం చేయగల సామర్థ్యం ఏర్పడి, అమ్మకాలు పెరిగి మరింత లాభాలు చేకూరుతాయి. సరుకులు తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి కొనుగోలు శక్తి విస్తరించి, ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి పరిశ్రమలు వృద్ధి చెందు తాయి. దీనితో పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది. అక్షరా స్యులకే కాదు, నిరక్షరాస్యులకు, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. నిరుద్యోగం సమసి పోతుంది. కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. వల సలు, ఆత్మహత్యలు, నేరాలు, క–{తిమ కరువులు అదృశ్య మవుతాయి. ఇంకోవైపు రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొ న్న ప్రత్యేక సహాయం ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబాటు తనాన్ని తగ్గించవచ్చు. రాజధాని నిర్మాణానికి అవసర మైన నిధులన్నింటినీ కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర ఆర్థికవృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనలకు, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులన్నీ దాదాపు దానంగానే కేంద్రం నుండి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం పొం దుతుంది. దీనికి తోడు సాధారణ సహాయం కూడా ఎలాగూ పొందవచ్చు. అన్ని రాష్ట్రాలు పొందినట్లు ప్రత్యే క కేటగిరీ రాష్ట్రం కూడా వాటిని పొంది మరింత అభి వృద్ధికి నోచుకుంటుంది. వైఎస్సార్ కాలం నాటి అభి వృద్ధి స్థాయిలో ఏపీని ముందుకు తీసుకువెళ్లడానికి వీలు వుతుంది. కానీ మనకు త్వరితగతి వృద్ధిని ఇచ్చే హోదా కావాలా, కుంటి నడక ప్యాకేజీలు కావాలా అనేది మనం చేపట్టే ఒత్తిడి కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్‌కు దీర్ఘ కాలిక ఆర్థిక అనారోగ్యాలు, అంటురోగాలు వచ్చాయి. పంట భూములన్నీ విదేశీ, స్వదేశీ ప్రైవేట్ సంస్థల అధీనమైనాయి. వ్యవసాయం దాదాపు కనుమరుగై, వ్యవసాయ రంగం లేని వ్యాపార దళారీ లాంటి సింగ పూర్ లాగా కొత్త రాష్ట్రం మారుతోంది. మరి రైతులు పరిస్థితి ఏమిటి? ఈ ప్రైవేట్ రాజధానిలో, ప్రైవేట్ విమా నాశ్రయాల వంటి వాటిలో, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లలో, హోటళ్లలో, వాల్మార్ట్లలో ఫ్లోర్లు తుడిచే వారిగా, వంట చేసేవారుగా; ఇవి కూడా చేయ లేకుంటే అడుక్కుతినే వారిగా రైతులు, వ్యవసాయ కూలీ లు, ఇతర వృత్తుల వారు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నేటి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక కేటగిరీ ఇవ్వన ట్టయితే, ఇది ప్రైవేట్ రాజధాని, ప్రైవేట్ విమానా శ్రయాలు, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ ఓడరేవులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ తాగునీటి అంగళ్లు, ప్రైవేట్ సాగునీటి అమ్మక కేంద్రాలు, ప్రైవేట్ అడవులు, ప్రైవేట్ పార్కులు, ప్రైవేట్ పార్కింగ్లు, ప్రైవేట్ టూరి జం, ప్రైవేట్ విద్యుత్తు వంటి వాటితో నిండిపోతుంది. బ్రిటిష్ ఈస్టిండియా ప్రైవేట్ కంపెనీ మన దేశం మీద పెత్తనం సాధించి పీడించుకు తిన్నట్లు ఈ ప్రైవేట్ వ్యవ స్థలు జనాన్ని పీల్చుకుతింటాయి. వాటి పీడ వదిలించడా నికి మరో గాంధీ మహాత్ముడు పుట్టి దీర్ఘకాలిక ఉద్యమం నడపాల్సి ఉంటుంది. ఇందతా సత్యం. జనం తమ కర్తవ్యం ఏమిటో తక్షణం నిర్ణయించుకోవాలి. -దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, మొబైల్: 9849584324