తిరుమల శ్రీవారి ప్రసాదానికి కొరత
తిరుమల: కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించిన పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీవారి దర్శనార్దం తిరుమల సన్నిదానానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆ గోవిందుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాక తిరుమల కలియుగ వైకుంఠం అని నానుడి.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారి ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో లడ్డూల తయారీ గణనీయంగా తగ్గనుంది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో ప్రస్తుతం నాణ్యత లేదని తెలిసింది. నెయ్యి కొరతను టీటీడీ కారణంగా చూపుతుండటంతో ప్రసాదం లేకుండానే వచ్చిన భక్తులు వెనుదిరుగుతున్నారు. దీంతో టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నాణ్యత లేదనే కారణంతో కొత్త టెండర్లను కాదని మళ్లీ పాత టెండర్ల వైపు టీటీడీ మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం.