devoters
-
వరాల తల్లికి విశేష పూజలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొత్తపేట, బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ తల్లికి ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోర్కెలు తీరిన భక్తులు బోనాలతో అమ్మవారి వద్దకు చేరుకుని వస్త్రాభరణాలను కానుకలుగా సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ సమీపానగల పోతురాజు వద్ద ముద్దలను ఏర్పాటు చేసి జంతుబలి ఇచ్చారు. ఆలయ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య బంధుమిత్రులతో ఆనందంగా విందు భోజనాలు ఆరగించారు. -
ఘనంగా వరలక్ష్మీ వ్రతం
లక్కిరెడ్డిపల్లె: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలోని రెడ్డివారిపల్లెకు వెళ్లే దారిలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, మర్రిచెట్టు వద్ద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
పుష్కర పునీతం
-
ఘనంగా నాగపంచమి
-
గోదావరిలో పెరిగిన భక్తుల రద్దీ
గోదావరి ఉధృతితో జల్లుల స్నానాలు పదివేలకు పైగా భక్తుల పుష్కరస్నానం మంథని: గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఏడోరోజు మంథనిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. సాదారణంగా భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే స్నానాలు ఆచరిస్తారు. కానీ శనివారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్నానఘట్టాల వద్ద పుష్కరస్నానం చేసి అటు తర్వాత జల్లుల స్నానం చేశారు. పిండ ప్రదానాలకు ఈ రోజు ప్రాధాన్యత గల దినం కావడంతో పెద్దసంఖ్యలో పిండప్రదానాలు చేశారు. పదివేలకు పైగా భక్తులు పుష్కరస్నానం చేశారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో ఏడోరోజు 15వేల మంది వరకు అంత్యపుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 1వఘాట్లో రెండువేల మంది, 2వ ఘాట్లో 12,000 వేల మంది, 3వ ఘాట్లో వెయ్యిమంది పుష్కర పుష్యస్నానాలు ఆచరించారు. వీఐపీలు ఎవరు రాలేదు. -
పుష్కరశోభ