Devrakadra
-
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
దేవరకద్ర : మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వరలక్ష్మీ వ్రతాలకు పలువురు మహిళలు హాజరయ్యారు. వరాలు ఇవ్వమ్మా వరలక్ష్మీదేవీ అంటు మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతాలు నిర్వహించి హారతులు ఇచ్చారు. వేదపండితులు శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలతో చేయించారు. మండల కేంద్రంలోని పలువురు ఆర్య వైశ్య మహిళలు తమ గహాల్లో వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించి ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, గాజులు, తాంబులం అందజేసీ దీవెనలు తీసుకున్నారు. -
కొనసాగుతున్న అఖండ దీపారాధన
దేవరకద్ర : మండల కేంద్రంలోని శివాలయం, వీరప్పయ్యస్వామి దేవాలయాల్లో శ్రావణ మాసం ప్రారంభం నుంచి అఖండ దీపారాధన కొనసాగుతున్నది. శుక్రవారం ఘనంగా పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో నిత్యం అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రతి రోజు రాత్రివేళ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖండ దీపాలు 41 రోజుల పాటు నిరంతరం వెలిగిస్తారు. భజనలు, అఖండ దీపారాధన కార్యక్రమాలు శ్రావణ మాసం ముగిసిన తరువాత మరో 11 రోజుల వరకు కొనసాగుతాయి.