DG cable office
-
కేబుల్ కార్యాలయంలో ఆగ్నిప్రమాదం
-
కేబుల్ ఆఫీస్ దగ్ధం
హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న డీజీ కేబుల్ ఆఫీస్ విద్యుద్ఘాతంతో పూర్తిగా దగ్ధమయింది. ఈ ప్రమాదం గురువారం ఉదయం 3 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంతో సుమారు రూ.3 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం నేపథ్యంలో డీజీ కేబుల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి.