కాటారం డీజీబీలో బంగారం మాయం?
కాటారం, న్యూస్‌లైన్: కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో ఓ ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది! ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, డీజీబీ రీజినల్ మేనేజర్ విచారణ ప్రారంభించారు. ఇది ఇంటిదొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతుండడంతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు.
మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజబాపు గత ఆగస్టులో తన అవసరాల నిమిత్తం సుమారు 9తులాల బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.08 లక్షలు రుణం పొందాడు. బుధవారం బ్యాంక్‌లో తాకట్టు పెట్టి న తన బంగారాన్ని విడిపించుకోవడం కోసం వడ్డీతో కలిపి రూ.1.23 లక్షలు చెల్లించాడు. బంగారం లాకర్లో భద్రపర్చి ఉందని, లంచ్‌టైం తర్వాత వచ్చి తీసుకువెళ్లాలని బ్యాంక్ అధికారులు ఆయనకు సూచించారు.
వా రు చెప్పిన సమయానికి బాధితుడు బ్యాంక్‌కు రాగా బం గారం దొరకడం లేదని, మరునాడు రావాలని కోరారు. రాజబాపు గురువారం ఉదయం బ్యాంక్‌కు చేరుకోగా.. బంగారం కోసం వెతుకుతున్నామని, సమయం పడుతుందన్నారు. ఆయన సాయంత్రం వరకు వేచి చూశా డు. వారి నుంచి స్పందన లేకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దిగి వచ్చిన అధికారులు బాధితుడికి న చ్చజెప్పి బంగారం వెతికి అప్పజెప్పుతామని సమయం కోరినట్లు తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈనోటా రా త్రి బయటకు పొక్కింది. సమాచారం అందుకున్న బ్యాంక్ రీజినల్ మేనేజర్ హుటాహుటిన కాటారం చేరుకుని విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా సీసీ కెమెరా ల్లో నిక్షిప్తమైన వీడియో రికార్డులు పరిశీలిస్తున్నట్లు స మాచారం. బంగారం మాయం వెనుక సిబ్బంది హస్త మున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా మరి కొంత బం గారం సైతం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం.
అకౌంటెంట్, క్యాషియర్ తప్పిదమేనా...?
బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి బాధ్యత అ కౌంటెంట్, క్యాషియర్ పైనే ఉంటుంది. బ్యాంక్‌లో నిల్వ ఉండే సొమ్ము, బంగారం ఆభరణాలు భద్రపర్చాల్సిన బాధ్యత వారిదే. తాళాలు సైతం వారిద్దరి దగ్గరే ఉంటా యి. వీరిని కాదని లాకర్లను తెరిచే అధికారం ఎవరికీ ఉండదు. బంగారం మాయం కావడంపై వీరి తప్పిదం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కానీ ఇది ఇంటి దొంగల ప నా... లేక ఇతరుల ప్రమేయం ఉందా అన్న నిజం బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ విషమయై బ్యాంక్ మే నేజర్ రాంచంద్రంరావును వివరణ కోరగా.. బంగారం మాయమైన విషయం వాస్తవమేనని, నిందితులు ఎవరైనా ఉపేక్షించబోమని అన్నారు.