జూలై 16న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
కత్రినా కైఫ్ (నటి), ధనరాజ్ పిళ్లై (హాకీ క్రీడాకారుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడి, వాటి వల్ల లబ్ధి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. వీరు పుట్టిన తేదీ 16. అంటే 7. దీనిమూలంగా ఆధ్యాత్మికోన్నతితోపాటు ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా భార్యాభర్తలు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం లేదా పూర్తి ఆధ్యాత్మికతో ఉండటం వల్ల సంసార జీవనానికి దూరమయే అవకాశం ఉంది కాబట్టి ఆధ్యాత్మికతతో పాటు ప్రాపంచిక విషయాల పట్ల కూడా ఆసక్తి చూడం మంచిది.
లక్కీ నంబర్స్: 1,2,3,7; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు. సూచనలు: దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. డబ్బును, మాటను జాగ్రత్తగా వాడటం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్