ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓకు ఫిర్యాదు
ధన్వాడ : మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై శనివారం డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ నాయకులు విష్ణు, రాజు, కురుమూర్తి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు. కూరగాయల టెండర్లలో జరిగిన అక్రమాలపై, విద్యార్థులకు రావాల్సిన కాస్మొటికి చార్జీలపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.