breaking news
Dharma Mahesh
-
రీతూతో రిలేషన్‌పై స్పందించిన ధర్మ మహేశ..!
-
ముచ్చుముఖం.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది, ఎంతమంది దగ్గర..!
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్‌పై నెలన్నర క్రితం పోలీసు కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. సినిమా ఛాన్సులు రావడంతో భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మహేశ్‌తో పాటు అతడి కుటుంబంపైనా ఫిర్యాదు చేసింది. అయితే భార్యాభర్తల గొడవలో అనూహ్యంగా రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది.ఫ్రెండ్ మాత్రమే..గర్భవతిగా ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం మానేసి రీతూ (Rithu Chowdary) వెంట తిరిగాడని మీడియాతో వాపోయింది గౌతమి. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడింది. తన అడ్డు తొలగిపోవడంతో అర్ధరాత్రి రీతూ ఇంటికి వచ్చేదంటూ సీసీటీవీ వీడియోలు సైతం రిలీజ్ చేసింది. అటు ధర్మ మహేశ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అంతమాత్రానికే డ్రగ్స్ అని, రిలేషన్ అని ఏవేవో ఊహించడం సరికాదని చెప్పాడు. 2023 నుంచే ఎఫైర్అయితే గౌతమి మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు. మహేశ్ (Dharma Mahesh), రీతూ బెడ్రూమ్లో ఉన్న సీసీటీవీ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటోంది. అలాగే రీతూతో ఉంటూనే తనను చీప్‌గా తీసిపడేసేవాడంది. ఇంకా ఏమందంటే? నా భర్త నన్ను ఫ్లాట్ నుంచి వెళ్లగొట్టాక అక్కడేం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. రోజూ అర్ధరాత్రి రీతూ కారులో వస్తుందన్నారు. ఆమె సెలబ్రిటీ, పైగా సార్‌కు పర్సనల్ అని తన సెక్యూరిటీ చెప్పారు. 2023 నుంచే వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న అనుమానం మొదలైంది.ముచ్చుముఖంతో నాకు ఎఫైరా?ఒకసారి అదే మాట నా భర్తను అడిగాను. అందుకాయన.. హీరోయిన్లతో ఎఫైర్ అంటగట్టు. అంతేకానీ ఇలాంటి ముచ్చుముఖాలు, సైడ్ ఆర్టిస్టులతో సంబంధం అంటగట్టకు అన్నాడు. అతడి సినిమాలో రీతూ సైడ్ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను గర్భిణీగా ఉన్నప్పుడు రీతూకి ఫోన్ చేసి ఈ ఎఫైర్ గురించి అడిగాను. అందుకామె ఛీఛీ.. నువ్వు నాకు తెలిసినదానివి. నేనెందుకు అలా చేస్తాను? అని నన్ను నమ్మించింది. కానీ, ఎప్పుడైతే రీతూ సావాసం మొదలైందో అప్పుడే నా భర్తకు ఏదో అలవాటు చేసింది.ఎంతమంది ఇళ్లలో దూరిందో..నా భర్త రాత్రిళ్లు రాకపోవడం, ఏవో నమలడం, కొన్నింటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానమేసింది. రీతూకి మా ఫ్లాట్ నచ్చిందట! ఆమె కోసమే నన్ను బయటకు వెళ్లగొట్టాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం నాలుగు గంటల వరకే రీతూ అక్కడ ఉంటుంది. వాళ్ల బెడ్రూమ్ వీడియోలు నా దగ్గరున్నాయి. నా ఇంటికే ఆమె అలా ధైర్యంగా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరింది?అదేంటో.. రీతూపై జాలినా అనుమతి లేకుండా నా భర్త దగ్గర అర్ధరాత్రి ఉండేందుకు తనెవరు? అదేంటో కానీ.. చాలామంది రీతూపై జాలిపడుతున్నారు. ఈ అమ్మాయి కాల్‌డేటా, వాట్సాప్ చాట్ తీయండి.. ఎంతమంది అబ్బాయిల డబ్బు కొల్లగొడుతుంది? ఈ డేటా మొత్తం తీయండి. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నవాళ్లందరూ కాస్తయినా సిగ్గుపడండి అని గౌతమి చెప్పుకొచ్చింది.చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్ -
అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్
బిగ్‌బాస్ హౌస్‌లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్ పవన్, లేదంటే పవన్ కల్యాణ్‌తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్‌బాస్ హౌస్‌ను పార్క్‌లా మార్చేసింది. కెప్టెన్‌గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.భార్యను వదిలి రీతూతో..చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్.. రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.రీతూ, నేను ఫ్రెండ్స్తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఫ్రెండ్‌లా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?ఇల్లు ఖాళీ చేయించిందిఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
Gowthami Chowdary: నా భర్తతో రీతూ చౌదరి ఎఫైర్..
-
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
Gautami Chowdary: అతనితో 19 ఏళ్లకే ప్రేమలో పడ్డా..! అప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు
-
వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్
-
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
తెలుగు హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతడి భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.గర్భంతో ఉన్నప్పుడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ.. ధర్మ మహేశ్ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు. అతడి కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. చంపేస్తానని బెదిరింపులువాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ భరించలేకే పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేశ్‌కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! విడాకులివ్వను, ఇలాగే వేధిస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదాం అని చెప్పుకొచ్చింది.సినిమాకాగా ధర్మ మహేశ్, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలో మహేశ్‌పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహేశ్.. సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల్లో నటించాడు.చదవండి: పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!