dharmavaram police station
-
ప్రేమ పేరుతో ఆకతాయి.. పోలీసుల సలహాలు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతా లేకుండాపోయింది. మొన్న దాచేపల్లి, నేడు గుంటూరు.. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఆడపిల్లల ఫిర్యాదులను చాలా తేలికగా తీసుకుంటున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి తమను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇద్దరు అక్కాచెల్లెలు ధర్మవరం పోలీసులను సంప్రదించారు. శాంతినగర్‌కు చెందిన ఓబులేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తమ వెంటపడి వేధిస్తున్నాడని తెలిపారు. అయితే ఆ ఆడపిల్లలకు ధైర్యం చెప్పి, వారి ఫిర్యాదు స్వీకరించకుండా, కేసు నమోదు చేసుకోకుండా పోలీసులు విచిత్రంగా ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ యువకుడు కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ హేళన చేస్తూ.. మాట్లాడారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వైపు ఆడపిల్లలపై రోజుకో దారుణం చోటుచేసుకుంటుంటే, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పు పడుతున్నారు. -
అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం
ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్ : తిరుపతి నుంచి అమరావతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడటంతో శనివారం రాత్రి ధర్మవరం స్టేషన్లో ఒకటిన్నర గంట పాటు ఆగిపోయింది. శనివారం రాత్రి 9 గంటలకు రైలు ధర్మవరం సమీపంలోకి రాగానే పెద్ద శబ్దంతో పాటు డీజిల్ వాసన గుప్పుమంది. దీంతో కొందరు ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అంతలో రైలు ధర్మవరం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు ఇంజిన్‌ను తనిఖీ చేయాలని ప్రయాణికులు సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో ప్రయాణికులు రైలును ముందుకు కదలనివ్వబోమంటూ పట్టాలపై కూర్చున్నారు. దీంతో రైల్వే అధికారులు ఇంజిన్‌ను పరిశీలించారు. డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడినట్లు గుర్తించారు. కాసేపట్లోనే డీజిల్ అంతా కారిపోయింది. చివరికి గుంతకల్లు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించి రైలును నడిపారు. దీంతో రైలు అక్కడే ఒకటిన్నర గంట పాటు ఆగింది. ప్రయాణికులు పట్టుబట్టకపోయి ఉంటే ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని అధికారులు పేర్కొన్నారు.