అబ్బాయిలూ జాగ్రత్త!
జీవితంలో సరిగ్గా స్థిరపడాలంటే మంచి ప్రణాళిక అవసరం. కానీ, ఎలా పడితే అలా జీవిస్తే? జీవితం గాడి తప్పుతుంది. అలా, యువతరం తప్పుదోవలో పడితే అది వారి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే కథాంశంతో జరుపుల గోపాల్ సమర్పణలో ధర్మవరపు చంద్రమౌళి నిర్మిస్తున్న చిత్రం -‘అబ్బాయిలూ... బి కేర్ఫుల్’. మల్లెల చరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ, రామకృష్ణ, నరేశ్, శ్రీచరణ్, అక్షయ్, శ్రీనయన, విజయసాయి, విష్ణు, మహేశ్వరి ముఖ్య తారలు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్ మూడో షెడ్యూల్ రాజమండ్రి, కాకినాడ, యానాం పరిసరాల్లో జరగనుంది.