బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరి దారుణ హత్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ధర్మేంద్ర చౌదరి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ సభలో పాల్గొనేందుకు తన కారులో వెళుతున్న ఆయనను ఇద్దరు దుండగులు ఆపి తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. బన్నాదేవి ప్రాంతంలోని ఓల్డ్ నగర్ నిగమ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు.
ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ద్రువీకరించారని పోలీసులు తెలిపారు. 2017లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అట్రౌలీ నుంచి పోటీ చేసేందుకు ధర్మేంద్ర టికెట్ సాధించారు.