ధావన్ డకౌట్
మొహాలి: దక్షిణాఫ్రికా తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌటయ్యాడు. 1.4 ఓవర్ లో ఫిలాండర్ బౌలింగ్ లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మురళీ విజయ్(4), చతేశ్వర్ పుజారా(9) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. టీమిండియా 5 ఓవర్లలో 13/1 స్కోరు చేసింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నాడు.