లాలాజలంతో మధుమేహంగుర్తింపు
పరిశ్రమను ప్రారంభించిన మంత్రి జూపల్లి
తూప్రాన్: లాలాజలంతో మధుమేహ వ్యాధిని గుర్తించే సాంకేతిక సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రప్రథమంగా మెదక్ జిల్లా తూప్రాన్‌లో పరిశ్రమను నెలకొల్పడం చరిత్రాత్మకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఇండ్రస్ట్రియల్ పార్కులో నూతనంగా నెలకొల్పిన డయాబెట్ ఓమిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో అనేకమంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని, వ్యాధి నిర్ధారణకే వేల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. ఈ వ్యాధిని తక్కువ ఖర్చుతో గుర్తించేందుకు డయాబెట్ ఓమిక్స్ పరిశ్రమ నిర్వాహకులు ఒక చిన్న స్టిక్‌ను కనిపెట్టినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే ఉండి ఈ స్టిక్ సాయంతో షుగర్ వ్యాధిని గుర్తించుకోవచ్చన్నారు. ఈ పరిశ్రమ వచ్చే 14 నెలల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్నారు. పరిశ్రమ నిర్వాహకులు, శాంతాబయోటిక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.