ర్యాంప్ వాక్ అదుర్స్
విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్వేలో బుధవారం జరి గిన వసుంధర డైమండ్ రూఫ్ బ్రాండ్ ప్రీ లాంచ్ కార్యక్రమం సందర్భంగా వజ్రాభరణాలతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. నెక్లెస్లు, చెవి దిద్దులు, హారాలు, విభిన్న రకాల గొలుసులు, బ్యాంగిల్స్, రింగ్స్ వంటి వజ్రాభరణాలు ధరించిన మోడళ్లు హల్చల్ చేశారు. హైదరాబాద్లో వజ్రాభరణాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ తన కార్యకలాపాలను నవ్యాంధ్రకు విస్తరించింది.
హోటల్ గేట్వే ఎదురుగా ఏర్పాటు చేసిన వసుంధర డైమండ్ రూఫ్ షోరూంను గురువారం ప్రముఖ సినీ నటి శ్రీదేవి ప్రారంభిస్తారని షోరూమ్ అధినేత వసుంధర తెలిపారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. షోరూమ్ ప్రతినిధి ఆయుషి తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ (లబ్బీపేట)