Dicpalli
-
‘మంచు’కొచ్చిన ముప్పు
డిచ్పల్లి: దైవదర్శనం చేసుకొని వస్తున్న ఆ కుటుంబ పెద్దలను మృత్యువు మంచు రూపంలో కబళించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలో గురువారం జరిగింది. అతివేగం.. దట్టమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. డిచ్పల్లి ఎస్ఐ నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌లోని గంజ్‌రోడ్ కాలనీలో గనిశెట్టివార్ ప్రకాశ్ (74) (రిటైర్డ్ ఉద్యోగి), ఆయన భార్య చాంద (68), కొడుకులు శ్రీనివాస్, శివప్రసాద్, కోడళ్లు సుస్మిత, హారిక, మనవళ్లు శౌర్య, శితిజ్, జగన్నాథ్, మనవరాలు గాయత్రి ఈ నెల 11న ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. బుధవారం శంషాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. తెల్లవారుజామున వీరి వాహనం నాకాతండా సమీపంలోకి రాగానే పొగమంచు కమ్ముకోవడంతో పల్టీలు కొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
విద్యార్థుల నిరసన
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : విద్యార్థులకు, సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవం గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థులు వేదిక ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. బుధవారం నాడే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వర్సిటీ ఉన్నతాధికారులు సర్క్యులర్‌ను పంపిం చ డంతో విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు. గత ంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకుని ఈ సారైనా విద్యార్థులకు ముందస్తు సమాచా రం ఇవ్వకుండా మళ్లీ అదే రీతిలో జరపాలని యత్నించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన తెలుపడంతో పాటు వీసీని నిలదీశారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీసీ, ముందస్తు సమాచారం గురించి ప్రిన్సిపాల్ ధర్మరాజును అడగాలని తనను అడగవద్దన్నారు. విద్యార్థులను రిజి స్ట్రార్ లింబాద్రి సముదాయించారు. ఇవన్నీ చూసి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ప్రద్యుమ్న ఆశ్చర్యపోయారు. ఇలా జరుగకుండా చూడాలని వర్సిటీ అధికారులకు సూచించారు. సమయాభావం వల్ల అందరికి సకాలంలో సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని రిజిస్ట్రార్ సభాముఖంగా తెలియజేయాల్సి వచ్చింది. నెపాన్ని తనపై నెట్టడంతో ప్రిన్సిపాల్ మనస్థాపానికి గురయ్యారు. వేదిక పైకి పిలిచినా కొంత సేపటి వరకు ఆయన వెళ్లలేదు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. ఒక పాఠశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తారనిఅధికారుల ఒంటెత్తు పోకడల వల్ల వచ్చిన అతిథుల ముందు వర్సిటీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.