Dictator Movie
-
దేవరకు పోటీగా బరిలోకి దిగుతున్న బాలకృష్ణ.. అప్పటి రిజల్ట్ రిపీట్ కానుందా?
నందమూరి బాలకృష్ణ vs జూనియర్ ఎన్టీఆర్ అనేలా వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే.. ఈ విషయంలో చాలా రోజుల నుంచి వారి ఫ్యాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి కూడా.. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. దీంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు బహిర్గతం అయింది. దీంతో బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి కలెక్షన్స్‌పై పడింది. తారక్ ఫ్యాన్స్ ఆ సినిమాను చూడొద్దంటూ ఇంటర్నెట్లో వైరల్ చేశారు. ఇలా బాబాయ్, అబ్బాయి మధ్య వైరం మొదలైందని చెప్పవచ్చు. 2024 వేసవి సెలవుల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే దేవర చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదుల చేస్తున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించాడు. మరోవైపు బాలకృష్ణ ఎన్బికె 109 చిత్రాన్ని డైరెక్టర్ బాబీ ప్రకటించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం అయితే 2024 మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. సరిగ్గా దేవర చిత్రానికి కంటే ఒక వారం ముందుగానే విడుదల కానుంది. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి వార్ నడవడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే నిజం అయితే తారక్ మరోసారి పైచేయి సాధించడం గ్యారెంటీ అంటూ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్లో తారక్ వెంట నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోలు ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆయన అందరితో సన్నిహితంగా మెలగడమే దీనికి ప్రధాన కారణం అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా తారక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రకంగా నందమూరి హీరోలు అంటే ప్రథమంగా వినిపించే పేరు తారక్ అని చెప్పవచ్చు. గతంలో తారక్‌దే పైచేయి సంక్రాంతి బరిలో వారిద్దరూ పోటీపడ్డారు.. 2016లో నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిక్టేటర్ సినిమాతో బాలయ్య వచ్చారు. జనవరి 13న తారక్ వస్తే.. జనవరి 14న డిక్టేటర్తో బాలయ్య పోటీలోకి దిగాడు. అలా తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొట్టారు. ఆ సమయంలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది. అప్పుడు ఏపీలో నాన్నకు ప్రేమతో సినిమాకు ఎక్కువ థియేటర్లు లేకుండా చూసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ తారక్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అదే సమయంలో డిక్టేటర్ మిస్ ఫైర్ అయింది. అప్పటికే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తారక్‌కు మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఎక్కడ చూసిన నాన్నకు ప్రేమతో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ డిక్టేటర్ భారీ డిజాస్టర్‌ను మూట కట్టుకుంది. దీంతో అక్కడ బాబాయ్ మీద అబ్బాయిదే పైచేయి అయింది. మళ్లీ ఇదే సీన్ 2024లో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడు టాలీవుడ్‌కే పరిమితమైన తారక్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ మద్ధతు కూడా ఎక్కువగా జూ.ఎన్టీఆర్కే ఉంది. దేవర బొమ్మ థియేటర్లోకి వచ్చేంత వరకే బాలయ్య NBK 109 హడావిడి ఉంటుంది. ఏప్రిల్ 5 నుంచి ఎన్ని సినిమాలు ఉన్నా దేవరకు ఎవరు ఎదురు వచ్చినా కొట్టుకుపోవాల్సిందే.. అది నందమూరి బాలకృష్ణ అయినా సరే డౌటే లేదని చెప్పవచ్చు. -
ఎంతైనా ‘డిక్టేటర్’ కదా.. !
జిల్లాలో దాదాపు అన్ని థియేటర్లూ బాలయ్యకే తొలిరోజు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్‌కు పండగ సాక్షి, విశాఖపట్నం: బాబాయ్.. అబ్బాయ్ వివాదంలో చివరికి డిక్టేటర్దే పైచేయి అయ్యింది. ధియేటర్ల గొడవలో బాలయ్య పంతం నెగ్గింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రధాన సెంటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇదంతా ఒక్క రోజు మురిపెం మాత్రమే. గురువారం బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ రాగానే ధియేటర్లన్నీ ‘నాన్నకు ప్రేమతో’ తీసేసి ఆ సినిమాను ప్రదర్శించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నవి 75 ధియేటర్లు కాగా వాటిలో తొలిరోజు దాదాపు 64 ధియేటర్లలో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నగర పరిధిలో ఉన్న మల్టీప్లెక్స్‌లో అన్ని స్కీన్లలో కలిపి దాదాపు 35 సెంటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శించనున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న ‘నేను..శైలజ’, ‘మామ మంచు..అల్లుడు కంచు’ వంటి చిత్రాలకు గట్టి దెబ్బ తగులుతోంది. ఒకరోజు ముచ్చట.. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదలవుతుండటంతో వాటికి ధియేటర్ల కేటాయింపు విషయంలో రాజకీయ వత్తిళ్ల కారణంగా వివాదం తెలెత్తిన విషయం విదితమే. తొలిరోజు భారీగా విడుదలవుతున్న జూనియర్ చిత్రం వైభవం మర్నాటికి మారిపోనుంది. ఈ మొత్తం ధియేటర్లను బాలయ్య ‘డిక్టేటర్’ ఆక్రమించనుంది. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని నగరంలో మూడు ధియేటర్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు సమాచారం. అవి కూడా పెద్దగా కలెక్షన్ సెంటర్లు కానివి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్‌లో మాత్రం కనీసం ఒక్క స్క్రీన్‌లోనైనా ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. -
వాళ్లు నాకు పెళ్లి చేసేశారు
మీడియా వాళ్లు నాకు పెళ్లి చేసేశారు. బిడ్డను కూడా కనేసినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వదంతులు మనసుకు బాధను కలిగిస్తున్నాయి అంటున్నారు నటి అంజలి. పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళైంజయంతో విభేదాలంటూ ఆ మధ్య అశాంతికి గురైన ఈ బ్యూటీ ఇటీవలే కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యి హీరోయిన్గా బిజీ అయ్యారు. జయంరవితో సకలకళావల్లవన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం విమల్‌తో మాప్పిళై సింగం, రామ్ దర్శకత్వంలో తరమణి, విజయ్‌సేతుపతికి జంటగా ఇరైవి చిత్రాలతో పాటు తెలుగులో బాలక్రిష్ణ సరసన డిక్టేటర్ చిత్రంతో పాటు మోరో రెండు చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్నారు. ఈ సుందరిపై తరచూ వదంతులు ప్రచారం అవుతూ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్య అంజలికో చెల్లి ఉన్నట్లు ఆమె హీరోయిన్గా నటిస్తునట్లు ప్రచారం జరిగింది. తనకు చెల్లెలెవరూ లేరంటూ అంజలి ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చుకోవాలసిన పరిస్థితి. తాజాగా అంజలి ఒక వ్యాపారవేత్తను ప్రేమిస్త్తున్నారని,ఆమెకు పెళ్లి అయిపోయి, ఒక బిడ్డ కూడా పుట్టాడని రకరకాల ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. అవన్నీ వదంతులే అంటూ అంజలి ఖండించారు. తానెవరినీ పెళ్లి చేసుకోలేదు. అలాంటిది తనకు బిడ్డ ఎలా ఉంటుంది?అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారామె. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే అని అంజలి స్పష్టంచేశారు. మౌనంగా ఉంటే రెచ్చిపోతారు. ఎదురు తిరగితే అణిగి ఉంటారు అని అన్నారు. -
సింగర్‌గా డిక్టేటర్?
నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా ‘డిక్టేటర్’ సెట్స్ మీదకెళుతోంది. ఇటీవలే ‘లౌక్యం’తో బంపర్ హిట్ సాధించిన శ్రీవాస్, ఇందులో బాలకృష్ణను సరికొత్త రీతిలో ఆవిష్కరించనున్నారు. నందమూరి అభిమానులతో పాటు మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం కోసం కోన వెంకట్, గోపీ మోహన్ తదితర రచయితల బృందంతో కలిసి శ్రీవాస్ పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఫిలిమ్నగర్లో తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే - ఇందులో బాలకృష్ణతో పాట పాడించనున్నారట. ఆ మధ్య ఉత్తరాంధ్ర తుఫాన్ బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన ‘మేము సైతం...’ చారిటీ షోలో మొదటిసారిగా బాలకృష్ణ గొంతు విప్పి, అందరినీ ఆశ్చర్యపరిచారు. దానికి తోడు సంగీత దర్శకుడు తమన్ తన ప్రతి సినిమాలోనూ ఆయా హీరోతో పాట పాడించే ప్రయత్నం చేస్తుంటారు. ‘పవర్’ సినిమాలో ‘నోటంకీ నోటంకీ’ అని రవితేజతో, ‘రభస’లో ‘రాకాసి... రాకాసి’ అంటూ చిన్న ఎన్టీఆర్‌తో పాటలు పాడించి అభిమానులను ఉర్రూతలూగించారు. గత అనుభవం దృష్ట్యా ఈసారి బాలయ్యతోనూ తమన్ పాట పాడిస్తారట. చిత్ర బృందం కూడా ఈ విషయమై చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. తమన్ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ‘‘బాలకృష్ణగారితో ఈ సినిమాలో పాట పాడించాలని అనుకుంటున్నా. ఆయన పాడే పాట నా కెరీర్లో కచ్చితంగా ఓ హిట్ సాంగ్ అవుతుంది’’ అని ఆనందం వెలిబుచ్చారు తమన్. ఇప్పటికే తమన్ ఆధ్వర్యంలో రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.