వాళ్లు నాకు పెళ్లి చేసేశారు | They had to marry me | Sakshi
Sakshi News home page

వాళ్లు నాకు పెళ్లి చేసేశారు

Published Wed, Sep 23 2015 3:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

వాళ్లు నాకు పెళ్లి చేసేశారు - Sakshi

వాళ్లు నాకు పెళ్లి చేసేశారు

మీడియా వాళ్లు నాకు పెళ్లి చేసేశారు. బిడ్డను కూడా కనేసినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వదంతులు మనసుకు బాధను కలిగిస్తున్నాయి అంటున్నారు నటి అంజలి. పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళైంజయంతో విభేదాలంటూ ఆ మధ్య అశాంతికి గురైన ఈ బ్యూటీ ఇటీవలే కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యి హీరోయిన్‌గా బిజీ అయ్యారు. జయంరవితో సకలకళావల్లవన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం విమల్‌తో మాప్పిళై సింగం, రామ్ దర్శకత్వంలో తరమణి, విజయ్‌సేతుపతికి జంటగా ఇరైవి చిత్రాలతో పాటు తెలుగులో బాలక్రిష్ణ సరసన డిక్టేటర్ చిత్రంతో పాటు మోరో రెండు చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్నారు. 

ఈ సుందరిపై తరచూ వదంతులు ప్రచారం అవుతూ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్య అంజలికో చెల్లి ఉన్నట్లు ఆమె హీరోయిన్‌గా నటిస్తునట్లు ప్రచారం జరిగింది. తనకు చెల్లెలెవరూ లేరంటూ అంజలి ఖండిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చుకోవాలసిన పరిస్థితి. తాజాగా అంజలి ఒక వ్యాపారవేత్తను ప్రేమిస్త్తున్నారని,ఆమెకు పెళ్లి అయిపోయి, ఒక బిడ్డ కూడా పుట్టాడని రకరకాల ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అవన్నీ వదంతులే అంటూ అంజలి ఖండించారు. తానెవరినీ పెళ్లి చేసుకోలేదు. అలాంటిది తనకు బిడ్డ ఎలా ఉంటుంది?అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారామె. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే అని అంజలి స్పష్టంచేశారు. మౌనంగా ఉంటే రెచ్చిపోతారు. ఎదురు తిరగితే అణిగి ఉంటారు అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement