గంజాయిని అరికట్టేందుకు చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ
రాజమహేంద్రవరం క్రైం :
జిల్లాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని ఏలూర్ రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని పోలీస్ అర్బ¯ŒS జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం, డీఎస్ఆర్బీ కార్యాలయాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో జరుగుతున్న గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని అన్నారు. శాటిలైట్ సిస్టం ద్వారా గంజాయి సాగును గుర్తించేందుకు చర్యలు జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ కదలికలు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వారి ప్రభావం లేదన్నారు. కార్యక్రమంలో అర్బ¯ŒS ఎస్పీ బి.రాజ కుమారి, అడ్మి¯ŒS ఎస్పీ రజనీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వి.రామకృష్ణ, డీఎస్ఆర్బీ ఇ¯ŒSచార్జి డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్ సీఐ చింతా సూరిబాబు, ఎస్సైలు సంపత్, రామ్మోహనరావు, సత్యనారాయణ, ఎస్బీ ఎస్సై మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.