లోయలో పడిన బస్సు: 17 మంది మృతి
బస్సు లోయలోపడి 17 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లా డిగ్డోల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
బస్సు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని వివరించరు. బస్సు ప్రయాణికుల్లో అత్యధికులు పూంచ్, రాజోరి జిల్లాలకు చెందిన యవతేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆ ప్రమాదం సంభవించిందన్నారు.