digital photography
-
సిగరెట్ ప్యాక్ కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక!
సిగరెట్ బాక్సుల మీద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్ ఉత్పత్తుల పై గ్రాఫిక్ ఫోటోతో కూడిన వార్నింగ్ సందేశాలు ఉండేవి. సిగరెట్ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు. ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2) -
డిజిటల్ ఫొటోలలో తగినంత డెప్త్ లేదు: ఇళయరాజా
ఫొటోగ్రఫీ అంటే ప్రాణం పెడతారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. అలాంటిది, డిజిటల్ ఫొటోగ్రఫీ వచ్చిన తర్వాత అసలు అది తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెబుతున్నారు. ''అంతా డిజిటల్ మయమైపోయినప్పటి నుంచి నాకు అసలు ఫొటోలు తీయడంపైనే ఆసక్తి చచ్చిపోయింది. రీల్ వేసి ఫొటో తీసినదాంట్లో వచ్చినంత డెప్త్ ఇప్పుడు డిజిటల్ ఫొటోలలో రావట్లేదు. డిజిటల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఓ అద్భుత ప్రపంచాన్ని నాశనం చేశాం" అని ఇళయరాజా అన్నారు. ముందుగానే సంగీతంతో విపరీతంగా బిజీ అయిపోయిన ఇళయరాజాకు ఫొటోలు తీయడానికి సమయమే చిక్కడంలేదు. కేవలం ప్రయాణాలు చేసేటప్పుడే ఫొటోలు తీస్తారు. సమయం పెద్దగా లేకపోయినా, గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఇళయరాజా దాదాపు 5వేల ఫొటోలు తీశారు. ఇటీవలే ఆ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. తాను 1978లో ఫొటోలు తీయడం మొదలుపెట్టానని, బయటకెళ్లి ఫొటోలు తీసే సమయం లేకపోయినా.. వీలైనప్పుడల్లా తీసేవాడినని ఇళయరాజా చెప్పారు. ప్రకృతి చిత్రాలు తీయడం ఇష్టమని, గత కొన్నేళ్లుగా తాను చాలా కెమెరాలు కొని దాదాపు 5వేల ఫొటోలు తీశానని అన్నారు. నిజమైనవి, కదులుతున్నవాటినే తాను ఫొటో తీసేవాడినని, అవేవో ఊరికే తీసినవి కావని, వాటిలో జీవం ఉందని ఆయన తెలిపారు. ఒకసారి బెంగళూరులో ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే చాలా బాధగా అనిపించి ఫొటో తీశానని, కాసేపటి తర్వాత చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇతర నగరాలతో పాటు సింగపూర్, దుబాయ్, లండన్ లాంటి చోట్ల కూడా తన ఫొటోలతో ఎగ్జిబిషన్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు.