బెయిల్‌పై విడుదలైన డీజీ వంజరా
సోహ్రాబుద్దీన్, ఇషత్ ్రఎన్‌కౌంటర్ కేసుల్లో నిందితుడు
అహ్మదాబాద్: ఇషత్ ్రజహాన్, సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ప్రధాన నిందితుడైన వివాదాస్పద మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. 2004లో ఇషత్ ్రజహాన్, 2005లో సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో వంజరాను 2007 ఏప్రిల్‌లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఏడున్నరేళ్లుగా జైల్లోనే ఉన్నారు. బుధవారం బెయిల్ లభించిన అనంతరం సబర్మతీ కేంద్ర కారాగారం నుంచి బయటకు రాగానే.. ‘తనకు, తనలాంటి పోలీసులకు మంచి రోజులు వచ్చాయి (అచ్చే దిన్ ఆయే)’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఇంతకాలం జైల్లో ఉండడానికి రాజకీయ కారణాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను చేసిన పనుల గురించి విచారించేదేమీ లేదు. పోలీసులు అనుమానిత ఉగ్రవాదులను ఎన్కౌంటర్లు చేయడం ద్వారా గుజరాత్‌ను మరో కశ్మీర్‌లా మారకుండా చేయగలిగారు.’’అని వంజరా వ్యాఖ్యానించారు. తాను చేసినవన్నీ నిజమైన ఎన్కౌంటర్లేనని.. తమపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని పేర్కొన్నారు.