Dilimitesan
-
కొత్త జిల్లాల మాటున కుట్ర
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల మాటున దాగిన కుట్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాల విభజన పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రభావం చూపేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర గురించి కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు వివరిస్తామన్నారు. తమ పార్టీ నేతలు దసరా తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో సీఎం కేసీఆర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఎదిగివస్తున్న ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని అణచి వేయడానికి, తనకు అడ్డంకిగా ఉన్న నేతలను దెబ్బతీయడానికి జిల్లాల పేరుతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. అసెంబ్లీని వాయిదా వేసి కొత్త జిల్లాలకు సీఎం ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంతపాడుతున్నారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేయించిన కాంగ్రెస్ నాయకులు రాష్ర్టంలోనే ఉన్నారని, ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దాని ప్రభావం రిజర్వ్డ్ నియోజకవర్గాలపై పడుతుందన్నారు. డీలిమిటేషన్‌పై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చూసినా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల సరిహద్దులు మార్చడానికి వీలులేదన్నారు. డీలిమిటేషన్‌కు ముం దుగానే సరిహద్దులు, పరిధిని మార్చడం ద్వారా తాను అనుకున్న విధంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య వంటి కొందరి నియోజకవర్గాలు ఎస్సీల నుంచి జనరల్‌గా మారిపోతాయన్నారు. -
నిరాశే!
అందుబాటులోకి రాని ఓటర్ల జాబితా అమలుకు నోచని ప్రకటనలు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రకటనలకు... కార్యాచరణకూ మధ్య ఎంతో తేడా ఉంటోంది. డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల వెల్లడిలో జాప్యమే దీనికి నిదర్శనం. ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల (డివిజన్ల) వారీగా మంగళవారం అన్ని సర్కిల్, ఆర్డీఓ, తహసీల్దారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ చాలా సర్కిళ్లలో రాత్రి వరకూ ఇవి అందుబాటులోకి రాలేదు. కొన్ని చోట్ల జాబితాల కాగితాల కట్టల (రోల్స్)ను ఉంచి వెళ్లారు. అధికారులను సంప్రదిస్తే ఇంకా జాబితాలు రూపొందుతున్నాయన్న సమాధానమే తప్ప వివరాలు వెల్లడి కాలేదు. అంతేకాకుండా వివరాలు సైతం అరకొరగా... అస్తవ్యస్తంగా ఉండటంతో రాజకీయ పార్టీలు, పరిశీలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు ప్రధాన కార్యాలయ వర్గాలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. సర్కిళ్లలో అందుబాటులో ఉన్న వివరాలు ప్రధాన కార్యాలయంలో లేకపోవడం విస్తుగొల్పుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి ఆమోదం లభించాకే సర్కిళ్లలో ప్రకటించడం ఆనవాయితీ కాగా... సర్కిల్ స్థాయిలోనే చివరిసారి పరిశీలించి ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. భారీగా ద రఖాస్తులు దాదాపు నెలన్నర రోజుల్లో ఓటరు జాబితాలో పేరు కోసం 1.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 4 వరకు జీహెచ్ఎంసీలోని ఓటర్లు 80,57,198 మంది కాగా... అక్టోబర్ 5 నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు 1,34,175 మంది. వీరిలో 28,370 దరఖాస్తులను ఆమోదించారు. 1,959 తిరస్కరించారు. మరో 1,03,846 పెండింగ్‌లో ఉన్నాయి. జాబితా నుంచి తొలగింపు కోసం 710 ఫిర్యాదులు రాగా... వాటిల్లో 70 తిరస్కరించారు. మిగతా 640 పెండింగ్‌లో ఉన్నాయి. పేర్లు, ఇతరత్రా పొరపాట్లు సవరించాల్సిందిగా 24,447 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 8529 ఆమోదించారు. 3111 తిరస్కరించారు. 12,807 పెండింగ్‌లో ఉన్నాయి. చిరునామా మార్పుల కోసం 4,889 దరఖాస్తులు వస్తే.. 757 ఆమోదించారు. 453 తిరస్కరించారు. 3679 పెండింగ్‌లో ఉన్నాయి. ఉప్పల్ నుంచి ఎక్కువ అభ్యర్థనలు ఓటర్లుగా నమోదు కోసం ఉప్పల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 12,445 దరఖాస్తులు అందగా... ఆ తర్వాతి స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉంది. అక్కడి నుంచి 11,029 దరఖాస్తులు అందాయి. చిరునామా మార్పులకు అత్యధికంగా రాజేంద్రనగర్ నుంచి 616 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాతి స్థానంలో మల్కాజిగిరి (516) ఉంది. పెరిగిన ఓటర్లు... కొన్ని సర్కిళ్ల నుంచి మంగళవారం రాత్రి పొద్దుపోయాక అందిన సమాచారం మేరకు వివిధ డివిజన్లలోని ఓటర్లు గతంలో కంటే భారీగా పెరిగారు. గన్‌ఫౌండ్రీ డివిజన్లో గతంలో దాదాపు 32 వేల ఓటర్లు ఉండగా... తాజా జాబితా మేరకు వీరి సంఖ్య 51,553కు పెరిగింది. జాంబాగ్‌లో గతంలో 38 వేల ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 59,293కు పెరిగారు. -
ఇప్పట్లో కష్టమే!
- జీహెచ్ఎంసీ ఎన్నికలపై మల్లగుల్లాలు - ఇంకా పూర్తికాని డీలిమిటేషన్ - వార్డుల రిజర్వేషన్లకు మరికొంత సమయం అవసరం - హైకోర్టును ఆశ్రయించనున్న సర్కారు..? - వచ్చే డిసెంబర్లో ఎన్నికలు లేనట్లే! సాక్షి, సిటీబ్యూరో: అందరూ అనుకుంటున్నట్లుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలోగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఇప్పటి వరకు వార్డుల డీలిమిటేషన్, రిజర్వేషన్లు తదితర ముఖ్యమైన అంశాలు ఓ కొలిక్కి రాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. అలాగే, ఎన్నికలకు మరింత సమయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని రాష్ట్ర మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడమూ గమనార్హమే. ఎన్నికల జాప్యంపై అందిన ఫిర్యాదుపై పలు పర్యాయాలు విచారణ జరిపిన హైకోర్టు అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి, డిసెంబర్ 15 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అక్టోబర్ నెలాఖరులోగా డీలిమిటేషన్ పూర్తయ్యే అవకాశాల్లేవు. నిబంధనల మేరకు ముసాయిదా ప్రజలముందుకు తెచ్చాక, వారి అభ్యంతరాల స్వీకర ణ తదితరమైనవి పూర్తిచేసి గెజిట్‌లో ప్రచురించాక, వార్డుల వారీగా ఎన్నికల జాబితా తయారీకి దాదాపు 70 రోజలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అదే విషయాన్ని హైకోర్టుకు సైతం నివేదించారు. డీలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ గణన తదితరమైన వాటికోసం మరో 100 రోజులు అవసరమని కూడా అంచనా వేశారు. ఎంత వేగంగా ఈ పనుల్ని పూర్తి చేసినా నవంబర్‌లోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నవంబర్ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితేనే డిసెంబర్లో ఎన్నికలు జరిగే వీలుంది. వాస్తవానికి అక్టోబర్ నెలాఖరునాటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయాల్సిందిగా హైకోర్టు అదేశించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్‌లో ఇది పూర్తయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ సవ్యంగా సాగేందుకు.. ఇతరత్రా అంశాల కోసం తమకు కొంత గడువు కావాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. సహేతుక కారణాలతో కొద్దిజాప్యాన్ని హైకోర్టు కూడా అంగీకరించగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిధులు కోల్పోయే ప్రమాదం గ్రేటర్ ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అతిపెద్ద మున్సిపల్ సంస్థకు పాలకమండలి లేకపోవడం వల్ల మౌలిక వసతులు దూరమవుతాయనే ఉద్దేశంతోనే తాము ఎన్నికల నిర్వహణపై కోర్టును ఆశ్రయించామన్నారు. అతిత్వరగా పాలకమండలి ఏర్పాటు కాకపోతే కేంద్రం నుంచి వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన నిధులు రాకుండా పోతాయన్నారు.