దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే
కనీసం రూ.430 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్కాన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా దిలిప్ బిల్డ్కాన్ కనీసం రూ.430 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ ద్వారా రూ.430 కోట్ల విలువైన తాజా షేర్లను, మరో 11.36 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కింద జారీ చేయనున్నారు. ఈ కంపెనీ రహదారులు ప్రధానంగా ఈపీసీ కాంట్రాక్టు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఐపీఓకు రావాలని ప్రయత్నించడం ఈ కంపెనీకి ఇది రెండోసారి.