గచ్చిబౌలిలో వింత వ్యాధికి ఇద్దరు మృతి
టెక్నాలజీ హబ్ గచ్చిబౌలీలో వింత వ్యాధి స్థానికులను భయాందోళన గురి చేస్తోంది. వింత వ్యాధి కారణంగా ఇద్దరు శిశువులు మరణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. వ్యాధిపై వైద్యులు కూడా నిర్ఱారణకు రాకపోవడం స్థానికులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కొందరు వైద్యులు డిప్తీరియా అని అనుమానించినా.. కాని ధృవీకరించలేకపోతున్నారు.
ఈ వ్యాధితో బాధపడుతున్న ఆరుగురిని చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఈ వ్యాధిపై నిలోఫర్ వైద్యులు ఓ పట్టాన నిర్ఱారణకు రాకపోవడంతో వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శిశు మరణాలకు కారణమవుతున్న వింత వ్యాధిపై వైద్యులు నిర్ఱారణకు రాకపోవడం సంబంధిత కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. శిశువుల మరణానికి కారణమవుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.