ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్
మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) డిప్లొమా అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫిట్టర్, షీట్‌మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ (మెషిన్ టూల్ మెయింటనెన్స్, డీజిల్, మోటార్ వెహికల్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్.
అర్హతలు: మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5
వెబ్సైట్: www.iitm.ac.in
అంకాలజీలో పోస్ట్ బేసిక్ డిప్లొమా
తిరువనంతపురంలోని రీజనల్ కేన్సర్ సెంటర్, పోస్ట్-బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్
కాలపరిమితి: ఏడాది
అర్హతలు: బీఎస్సీ(నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 12
వెబ్సైట్: http://www.rcctvm.org