సరదా ప్రయాణంలో సంఘటనలు...
ఆ ఐదుగురూ కాలేజ్ డేస్‌ని ఎంజాయ్ చేస్తారు. కాలేజ్ పూర్తయ్యాక ఒకరి ఇంటికి ఒకరు వెళ్లాలనుకుంటారు. వెళ్లిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రాకేశ్ మహంకాళి, పవన్‌కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్ మహంకాళి మాట్లాడుతూ -‘‘ఎంతో సరదాగా ప్రయాణం ప్రారంభించిన ఐదుగురు విద్యార్థులు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఆ సంఘటనల ద్వారా ఏం నేర్చుకున్నారు? అనేది సినిమాలో చూడాల్సిందే. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. మహి మాట్లాడుతూ -‘యువ తతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. నందు, సాయిరోనక్, హమీద్, అనుప్రియ, శిరీష, కృష్ణభగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఓ ముఖ్య పాత్రను శశాంక్ చేశారు.