భయపెట్టే అభినేత్రి
మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగులో ‘అభినేత్రి’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా టైటిల్ రోల్లో, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్ఎన్ సినిమాతో కలిసి ఎంవీవీ సత్యనారా యణ తెలుగులో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘ఫస్ట్‌టైం హారర్, కామెడీ చిత్రంలో నటిస్తున్నా. ‘బాహుబలి’, ‘బెంగాల్ టైగర్’, ‘ఊపిరి’ చిత్రాలతో ప్రేక్షకులు నాకు హ్యాట్రిక్ విజయాలు అందించారు. ఒకేసారి మూడు భాషల్లో నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని అన్నారు. ‘‘టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.
70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను తెలుగులో సమర్పించడం ఆనందంగా ఉంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. ‘‘ఇప్పటికే రెండు షెడ్యూళ్లు అయిపోయి. ఈ నెల 15 నుంచి వైజాగ్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: ఎస్ఎస్ తమన్, జీవీ ప్రకాష్‌కుమార్, కెమేరా: మనీష్ నందన్.