5 నుంచి ’అడవిలో హంతకుడు’ షూటింగ్
కొయ్యలగూడెం: ’అడవిలో హంతకుడు’ చిత్ర షూటింగ్‌ను ఈనెల 5వ తేదీ నుంచి కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్టు హీరో, దర్శక, నిర్మాత తగరం వంశీరాజు చెప్పారు. కొయ్యలగూడెంలో గురువారం చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందిరా ఆర్ట్ క్రియేషన్‌పై నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. తన స్వగ్రామం కొయ్యలగూడెం కావడంతో పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించేలా చిత్ర కథాంశాన్ని రూపొందించామన్నారు. తాను దర్శకులు రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, కోడి రామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశానని చెప్పారు. పయనం, ఆకర్షణ, పాపే నాప్రాణం చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేం అప్పారావు, ఆర్పీ దుర్గారావు, కాదంబరీ కిరణ్ నటిస్తున్నారన్నారు. తనకు నిర్మాత సి.కల్యాణ్ గాడ్‌ఫాదర్ లాంటివారన్నారు