ఓ పవర్ ఉంది..!
‘‘పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలోని ప్రతి పార్ట్‌లో ఓ పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్‌ను టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోతుంది...’’, ‘‘భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది... విని మారకపోతే చచ్చాక వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా... చచ్చాక వింటావా...’’ - ఇలాంటి శక్తిమంతమైన సంభాషణలు పలకడం నందమూరి బాలకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి బోల్డన్ని సంభాషణలు ఆయన నటించిన తాజా చిత్రం ‘లయన్’లో వినవచ్చు.
సత్యదేవా దర్శకత్వంలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ఇది. త్రిష, రాధికా ఆప్టే నాయికలు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘బాలకృష్ణ నట విశ్వ రూపాన్ని మరోసారి చూపించే చిత్రం ఇది. మణిశర్మ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభించింది.
బాలకృష్ణ సంభాషణలను థియేటర్లో వినాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డైలాగుల్లోనే కాదు.. కథలో కూడా ఓ పవర్ ఉంది. బాలయ్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని సత్యదేవా అద్భుతంగా తెరకెక్కించారు’’ అని నిర్మాత అన్నారు.