‘కోట’లో ఆర్కిటెక్చర్ ఆఫ్ హెరిటేజ్ డెరైక్టర్
ఖిలావరంగల్ : చారిత్రక ఖిలావరంగల్ కోటను ఆర్కిటెక్చర్ ఆఫ్ హెరిటే జ్ (న్యూఢిల్లీ) డెరైక్టర్ దివాయి గుప్త మంగళవారం సాయంత్రం సందర్శించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి కాకతీయులు శిల్ప సంపదను తిలకించారు.
స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి శిల్పాల ప్రాంగణంలోని నాలుగు కీర్తితోరణాల మధ్య నల్లరాతి శిల్పకళాకృతులు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియూడారు. అనంతరం ఏకశిల గుట్ట, ఖుషిమహల్ రాతి, మట్టికోట ఆందాలను కెమెరాల్లో బంధించారు.వారి వెంట ఇంటాక్ కన్వీనర్, ఫ్రొఫెసర్ పాండురంగారావు, ‘కుడా’ ఈఈ అజీత్‌రెడ్డి, డీఈ బీమారావు, శంకర్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు ఉన్నారు.