కేన్సర్ చికిత్సకు వ్యాక్సిన్లు!
లండన్: కేన్సర్‌ను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. మానవుని సొంత వ్యాధినిరోధక శక్తితో కేన్సర్ కణాలను నాశనం చేసే విధానాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కేన్సర్ కణితిలోని ప్రత్యేకమైన కణాలను శరీరం గుర్తించేలా చేసి వాటిని నాశనం చేసే విధానాన్ని వారు కనుగొన్నారు. పరివర్తన చెందిన కణాలను లక్ష్యంగా చేసుకునేందుకు రెండు రకాల విధానాలున్నాయని పేర్కొన్నారు. అందులో ఒకటి కేన్సర్ సోకిన వ్యక్తికి చెందిన వ్యాక్సిన్లను అభివృద్ధిపరిచి కణితి కణాలను గుర్తించడం. రెండోది వ్యాధి నిరోధక కణాలను బయటకు తీసి ల్యాబ్‌లో వాటి సంఖ్యను పెంచి, తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కేన్సర్ కణాలను టార్గెట్‌గా చేసుకోవడం.