dishonour
-
‘ఐఏఎస్, ఐపీఎస్‌లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారు’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్‌లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరును చంద్రబాబు తప్పుబట్టడం సిగ్గు చేటన్నారు. అధికారులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను అవమానపరిచే విధంగా చంద్రబాబు తీరు ఉందని వారికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. -
ప్రేమ పెళ్లి : బావమరుదుల అఘాయిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతీ యువకుల హత్యలకు హద్దూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని, యువతి సోదరులు అతి దారుణంగా హత్య చేశారు. పానిపట్ బిజీ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పరువు పేరుతో ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా హరియాణాలో గత మూడురోజుల్లో ఇది రెండవ హత్య. నీరజ్(23) అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఒక నెలన్నరలోపే కుల దురహంకారానికి బలైపోయాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నీరజ్, తమ సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో నీరజ్ భార్య సోదరులు కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. నీరజ్‌ను కనీసం డజను సార్లు పొడిచి చంపి అక్కడినుంచి పరారయ్యారు.చాలాకాలంగా నిందితులు తన తమ్ముడిని బెదిరిస్తున్నారని, పోలీసుల రక్షణ కోరినా పట్టించుకోలేదని నీరజ్ సోదరుడు జగదీష్ వాపోయారు. దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్ భార్యకు ఫోన్ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ, పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీంటి పర్యంత మయ్యాడు. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించి, ఇందుకు గ్రామ పంచాయతీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపాయి, కానీ ఆ మహిళ సోదరులు అంగీకరించలేదనీ, నీరజ్ దంపతులపై బెదరింపులకు పాల్పడ్డారని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వాట్స్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. -
ప్రతిపక్షనేతకు ఇదేనా గౌరవం.?
వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉదయభాను జగ్గయ్యపేట అర్బన్: ప్రతిపక్ష నేత, ప్రజాప్రతి నిధులను ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా అవమానించిందని వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. శనివారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిం చేందుకు పుష్కరాల ప్రారంభం రోజున ఆయన ఊర్లో లేని సమయంలో మంత్రి రావెల కిషోర్‌బాబు వెళ్లటం బాధాకరమన్నారు. పైగా తమకు అవమానం జరిగిందని ఆరోపణలు చేయటం తగదన్నారు. ముందుగా పిలవకుండా పుష్కరాలు ప్రారంభమైన తరువాత ఆహ్వానించటం పద్ధతేనా అని ప్రశ్నించారు. ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని, మంచినీరు, టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవటంతో భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పుష్కర భక్తులను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు తన్నీరు నాగేశ్వరరావు, ఎండీ అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ నరసింహారావు పాల్గొన్నారు.